close
Choose your channels

`ఖైదీ` ద‌ర్శ‌కుడితో క‌‌మ‌ల్ కొత్త సినిమా..!

Wednesday, September 16, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

`ఖైదీ` ద‌ర్శ‌కుడితో క‌‌మ‌ల్ కొత్త సినిమా..!

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్‌హాస‌న్ కొత్త సినిమాను బుధ‌వారం అధికారికంగా ప్ర‌క‌టించారు. `ఖైదీ`తో సెన్సేష‌న‌ల్ హిట్ కొట్టిన లొకేష్ క‌న‌రాజ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. క‌మ‌ల్‌హాస‌న్ 232వ సినిమా ఇది. రాజ్‌క‌మ‌ల్ ఫిలింస్ ఇంట‌ర్నేష‌న‌ల్ బ్యాన‌ర్‌పై క‌మ‌ల్ హాస‌న్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. `వ‌న్స్ అపాన్ ఏ టైమ్ దేర్ లివ్‌డ్ ఎ ఘోస్ట్‌` అని అనౌన్స్‌మెంట్ పోస్ట‌ర్‌పై రాసుంది. వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లో సినిమాను విడుద‌ల చేసేలా ప్లాన్ చేసుకున్నారు. `ఎవ‌నెండ్రు నిన్నైతాయి` అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

యువ సంగీత ద‌ర్శ‌కుడు అనిరుధ్ ర‌విచంద్ర‌న్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. నిజానికి ప్ర‌స్తుతం శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో `భార‌తీయుడు 2` సినిమా చేస్తున్న ఈ సమ‌యంలో క‌మ‌ల్ కొత్త సినిమాను అనౌన్స్ చేసింది చూస్తుంటే.. భార‌తీయుడు 2 హోల్డ్‌లో ప‌డిన‌ట్లే అని అంటున్నాయి సినీ వ‌ర్గాలు. మ‌రో ప‌క్క క‌మ‌ల్ హాసన్ బిగ్‌బాస్ సీజ‌న్ 4తో పాటు.. రాజ‌కీయాల్లో బిజీగా ఉండబోతున్నారు. ప‌రిస్థితి చూస్తుంటే, భారతీయుడు 2 ఆగిన‌ట్లే అనిపిస్తుంది. మరిప్పుడు శంకర్ ఏం చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.