`ఖైదీ` ద‌ర్శ‌కుడితో క‌‌మ‌ల్ కొత్త సినిమా..!

  • IndiaGlitz, [Wednesday,September 16 2020]

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్‌హాస‌న్ కొత్త సినిమాను బుధ‌వారం అధికారికంగా ప్ర‌క‌టించారు. 'ఖైదీ'తో సెన్సేష‌న‌ల్ హిట్ కొట్టిన లొకేష్ క‌న‌రాజ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. క‌మ‌ల్‌హాస‌న్ 232వ సినిమా ఇది. రాజ్‌క‌మ‌ల్ ఫిలింస్ ఇంట‌ర్నేష‌న‌ల్ బ్యాన‌ర్‌పై క‌మ‌ల్ హాస‌న్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. 'వ‌న్స్ అపాన్ ఏ టైమ్ దేర్ లివ్‌డ్ ఎ ఘోస్ట్‌' అని అనౌన్స్‌మెంట్ పోస్ట‌ర్‌పై రాసుంది. వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లో సినిమాను విడుద‌ల చేసేలా ప్లాన్ చేసుకున్నారు. 'ఎవ‌నెండ్రు నిన్నైతాయి' అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

యువ సంగీత ద‌ర్శ‌కుడు అనిరుధ్ ర‌విచంద్ర‌న్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. నిజానికి ప్ర‌స్తుతం శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో 'భార‌తీయుడు 2' సినిమా చేస్తున్న ఈ సమ‌యంలో క‌మ‌ల్ కొత్త సినిమాను అనౌన్స్ చేసింది చూస్తుంటే.. భార‌తీయుడు 2 హోల్డ్‌లో ప‌డిన‌ట్లే అని అంటున్నాయి సినీ వ‌ర్గాలు. మ‌రో ప‌క్క క‌మ‌ల్ హాసన్ బిగ్‌బాస్ సీజ‌న్ 4తో పాటు.. రాజ‌కీయాల్లో బిజీగా ఉండబోతున్నారు. ప‌రిస్థితి చూస్తుంటే, భారతీయుడు 2 ఆగిన‌ట్లే అనిపిస్తుంది. మరిప్పుడు శంకర్ ఏం చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది.

More News

మాన‌వ‌త్వం ఇంకా ఉంద‌నే న‌మ్మ‌కం రెట్టిపైంది:  చిన్మ‌యి

మీటూ ఉద్యమాన్ని సౌత్ సినిమా ఇండ‌స్ట్రీలో లీడ్ చేసిన సింగ‌ర్ చిన్మ‌యి.. లాక్‌డౌన్ స‌మ‌యంలో త‌న దాతృత్వాన్ని చాటుకున్నారు.

మ‌హేశ్ 27.. ప్యాన్ ఇండియా మూవీనా..?

ఇప్పుడు తెలుగు స్టార్స్ అంద‌రూ ప్యాన్ ఇండియా హీరోలుగా ప్రూవ్ చేసుకోడానికి స‌న్నాహాలు చేసుకుంటున్నారు.

ఎస్పీబీ ఆరోగ్య పరిస్థితిపై తాజా అప్‌డేట్..

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం క్రమక్రమంగా మెరుగుపడుతోంది. కరోనా కారణంగా చికిత్స నిమిత్తం ఆయన చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే.

రవితేజ సరసన హాట్ భామ సీరత్!

టాలీవుడ్‌లో ఫైర్‌బాల్ ఆఫ్ హాట్‌నెస్‌గా పేరు తెచ్చుకున్న భామ సీరత్ కపూర్. ‘రన్ రాజా రన్’ ద్వారా టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన ఈ హాట్ భామ..

'రాజ్ పుత్`షూటింగ్ ప్రారంభం!!

బంజారా బిగ్ సినిమాస్ ప‌తాకంపై బంజార భాష‌లో `గోర్ మాటి`గా తెలుగులో `రాజ్ పుత్‌`గా రెండు భాష‌ల్లో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు రేఖ్యా నాయ‌క్‌.