కమల్ కొత్త సినిమా టైటిల్ ఇదే....

  • IndiaGlitz, [Saturday,November 21 2015]

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ చీకటిరాజ్యం నవంబర్ 20న విడుదలై మంచి క‌లెక్ష‌న్స్ సాధిస్తుంది. త యాక్షన్స థ్రిల్లర్ గా విడుదలకు సిద్ధమవుతున్న కమల్ అప్పుడే తన తదుపరి చిత్రానికి శ్రీకారం చుట్టాడు. ఈ చిత్రంలో కమల్ సరసన అక్కినేని అమల గెస్ట్ పాత్ర‌లో నటిస్తున్నారు. అమలతో పాటు మరో హీరోయిన్ కూడా నటించనుంది. గతంలో గురు(తమిళంలో సత్య), వెట్రి విళ, పెసుమ్ పడమ్(తెలుగులో పుష్పక విమానం) చిత్రాల్లో వీరిద్దరూ కలిసి నటించారు. దాదాపు పాతికేళ్ళ తర్వాత కమల్ మరోసారి అమలతో కలిసి నటించడానికి రెడీ అవుతున్నారు.

ఈ చిత్రం జనవరి నుండి ప్రారంభం కానుంది. రాజీవ్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. వీరి కాంబినేషన్ లో పాతికేళ్ళ క్రితం చాణక్యన్ అనే సినిమా రూపొందింది. ఏదైతేనేం ఇటు హీరోయిన్, అటు దర్శకుడు ఇద్దరితో పాతికేళ్ళ తర్వాత కమల్ కలిసి నటించబోతున్నారు. ఈ కొత్త చిత్రానికి అమ్మ‌నాన్న ఆట అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ప్యామిలీ రొమాంటిక్ డ్రామాగా తెర‌కెక్క‌నున్న ఈ చిత్రాన్ని అమెరికాలో చిత్రీక‌రించ‌నున్నార‌ట‌. ఈ విష‌యాన్ని క‌మ‌ల్ హాస‌న్ తెలియ‌జేశారు.

More News

ఓవర్ సీస్ ఫ్యాన్స్ కోసం మహేష్ భారీ ప్లాన్...

శ్రీమంతుడు సినిమాకి ఓవర్ సీస్ లో భారీ విజయాన్ని అందించిన ఫ్యాన్స్ కు థ్యాంక్స్ తెలియచేసేందుకు యు.ఎస్ లో ఓ భారీ ఫంక్షన్ చేయాలనుకున్నాడు మహేష్.

తరుణ్ ని చూసి నేర్చుకోమంటున్న వర్మ..

తరుణ్ అంటే నువ్వేకావాలి తరుణ్ కాదండీ..ఉయ్యాలా జంపాల రాజ్ తరుణ్. తాజాగా రాజ్ తరుణ్ కుమారి 21ఎఫ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

'రాజుగారింట్లో 7వ రోజు' పాటలు విడుదల

భరత్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ పై అజయ్ ప్రధానపాత్రలో భరత్,అర్జున్,వెంకటేష్,అక్షయ్,సుష్మిత నటీనటులుగారూపొందిన చిత్రం 'రాజుగారింట్లో 7వ రోజు'. ఫిరోజ్ రాజ దర్శకత్వంలో భరత్ కుమార్ పీలం ఈ చిత్రాన్నినిర్మించారు.

వెంకీ కొత్త టైటిల్...

విక్టరీ వెంకటేష్ కథానాయకుడుగా మారుతి దర్శకత్వంలో ఎస్.రాధాకృష్ణ తనయుడు ఎస్.నాగవంశీ నిర్మాతగా ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే.

బ్రహ్మోత్సవం ఆగింది..

సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న తాజా చిత్రం బ్రహ్మోత్సవం. ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో పి.వి.పి సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఈ మూవీలో మహేష్ సరసన సమంత, కాజల్, ప్రణీత నటిస్తున్నారు.