క‌మ‌ల్ నెక్స్ట్ ప్రాజెక్ట్?

  • IndiaGlitz, [Saturday,September 12 2015]

క‌మ‌ల్‌హాస‌న్ ప్ర‌స్తుతం చీక‌ట‌రాజ్యం ప్రాజెక్ట్ లో బిజీగా ఉన్నారు. ఆయ‌న ద‌గ్గ‌ర ద‌ర్శ‌క‌త్వ‌శాఖ‌లో ప‌నిచేసిన రాజేష్‌.ఎం.సెల్వ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. రాజ్‌క‌మ‌ల్ ఇంట‌ర్నేష‌న‌ల్ ప‌తాకంపై ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా త‌ర్వాత క‌మ‌ల్ ఏ సినిమాలో న‌టిస్తార‌నే అంశంపై కోలీవుడ్‌లో ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌నాలు వినిపిస్తున్నాయి.

ఇటీవ‌ల ద‌ర్శ‌కుడు మౌళి సిద్ధం చేసుకున్న క‌థ‌తో క‌మ‌ల్‌ను క‌లిశార‌ట‌. క‌మ‌ల్ కూడా మౌళి చెప్పిన స్క్రిప్టు బావుంద‌ని అన్నార‌ట‌. ఫ‌క్తు కామెడీ క‌థ అది. మౌళి 2002లో క‌మ‌ల్‌తో ప‌మ్మ‌ల్‌.కె.సంబంధం సినిమాను తెర‌కెక్కించారు. తాజాగా కూడా మౌళి ద‌ర్శ‌క‌త్వం చేస్తారా? అనే సందేహం జ‌నాల్లో మొద‌లైంది. అయితే స‌న్నిహిత వ‌ర్గాల స‌మాచారం మేర‌కు మౌళి చెప్పిన ఆ క‌థ‌ను డైర‌క్ట్ చేసే అవ‌కాశాన్ని కూడా క‌మ‌ల్‌హాస‌న్ ఇప్పుడు రాజేష్‌కే అప్ప‌జెప్పార‌ట‌. అంటే అటు సంగీత ద‌ర్శ‌కుడు జిబ్రాన్‌తో వ‌రుస సినిమాలు చేస్తున్న‌ట్టు ద‌ర్శ‌కుడు రాజేష్ తోనూ వ‌రుస సినిమాలు చేయ‌డానికి క‌మ‌ల్ రెడీ అయ్యార‌న్న‌మాట‌.

More News

గ‌ల్లా ఇంట్లో మ‌హేష్‌

శ్రీమంతుడు స‌క్సెస్‌లో ఉన్నారు మ‌హేష్‌. ఆ సినిమా విడుద‌లై స‌క్సెస్ అయిన త‌ర్వాత కొన్నాళ్ళ పాటు థాయ్‌ల్యాండ్‌కు వెళ్లొచ్చారు.

ఇమేజ్‌ని ప‌క్క‌న‌పెట్టిన హీరో

కొరియ‌ర్ బాయ్ క‌ల్యాణ్ కోసం నా ఇమేజ్‌ని కూడా ప‌క్క‌న‌పెట్టేశాను. కేవ‌లం కంటెంట్‌ని మాత్ర‌మే న‌మ్ముకుని ఈ సినిమా చేశాను.

అఖిల్ ఆడియో వేదిక‌

నేను విజ‌య‌వాడ నుంచి లాంఛ్ అయితే మీకేమైనా అభ్యంత‌ర‌మా?` అని అడిగి అభిమానుల‌ను ఉర్రూత‌లూగించిన అక్కినేని అంద‌గాడు అఖిల్‌.

ర‌జ‌నీ జోక‌ర్ కాద‌ట

త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టిస్తున్న తాజా చిత్రం క‌బాలి. ఈ చిత్రాన్ని రంజిత్ తెర‌కెక్కిస్తున్నారు.

అమ‌ల‌కి నాగ్ ఇచ్చిన బ‌ర్త్ డే గిఫ్ట్..?

శ్రీమ‌తి అమ‌ల పుట్టిన‌రోజు ఈరోజు. ఈ సంద‌ర్భంగా న‌వ మ‌న్మ‌ధుడు నాగార్జున శ్రీమ‌తి అమ‌ల‌కి బ‌ర్త్ డే గిఫ్ట్ ఇచ్చారు.