close
Choose your channels

బాధిత కుటుంబాల‌కు క‌మ‌ల్ ఆర్థిక సాయం

Thursday, February 20, 2020 • తెలుగు Comments

బాధిత కుటుంబాల‌కు క‌మ‌ల్ ఆర్థిక సాయం

క‌మ‌ల్‌హాస‌న్ హీరోగా శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం `ఇండియ‌న్ 2`. ఈ భారీ చిత్రానికి సంబంధించిన సెట్స్ వేస్తున్న‌ప్పుడు క్రేన్ విరిగిప‌డిపోయిన ప్ర‌మాదంలో డైరెక్ట‌ర్‌ శంక‌ర్ వ్య‌క్తిగ‌త స‌హాయ‌కుడు మ‌ధు(29), అసిస్టెంట్ డైరెక్ట‌ర్ సాయికృష్ణ‌(34), ఆర్ట్ అసిస్టెంట్ చంద్ర‌న్(60) చనిపోయారు. ఈ చ‌నిపోయిన వారికి సంతాపాన్ని ప్ర‌క‌టించిన క‌మ‌ల్‌హాస‌న్ బాధిత కుటుంబాల కోసం కోటి రూపాయ‌ల ఆర్థిక సాయాన్ని అందించ‌బోతున్న‌ట్లు తెలియ‌జేశారు. ఈ ప్ర‌మాదంలో ప‌ది మంది గాయ‌ప‌డ్డారు కూడా. వీరికి హాస్పిట‌ల్‌లో చికిత్స‌ను అందిస్తున్నారు. ప్ర‌మాద‌స్థ‌లాన్ని పోలీసులు ప‌రిశీలించారు. క్రేన్ ఆప‌రేట‌ర్ రాజ‌న్‌పై కేసు న‌మోదైంది.

ప్ర‌మాదం నుండి కాజ‌ల్ అగ‌ర్వాల్ తృటిలో త‌ప్పించుకున్నారు. ఈ విష‌యాన్ని ఆమె స్వ‌యంగా తెలియ‌జేశారు. కాజల్ ట్వీట్‌కు పెద్ద ఎత్తున అభిమానులు, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కొందరు నెటిజన్లు ఆమెకు ధైర్య చెప్పే ప్రయత్నం చేశారు.

దాదాపు పాతికేళ్ల క్రితం విడుద‌లైన ‘ఇండియ‌న్’ సినిమాకు సీక్వెల్‌గా ‘ఇండియ‌న్ 2’ రూపొందుతోంది. లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌ఫై సుభాస్క‌ర‌న్  ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాజ‌ల్ అగ‌ర్వాల్‌, సిద్ధార్థ్‌, ర‌కుల్ త‌దిత‌రులు ఈ చిత్రంలో న‌టిస్తున్నారు.

Get Breaking News Alerts From IndiaGlitz