close
Choose your channels

అట్టహాసంగా 'దర్బార్' మోషన్ పోస్టర్

Wednesday, November 6, 2019 • తెలుగు Comments

అట్టహాసంగా దర్బార్ మోషన్ పోస్టర్

సూపర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా స్టార్ డైరెక్ట‌ర్ ఎ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం `ద‌ర్బార్‌`. న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టిస్తుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. జ‌న‌వ‌రి 10న ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ‌, మల‌యాళ‌, హిందీ భాష‌ల్లో విడుద‌ల చేయ‌బోతున్నారు. సినిమా ప్ర‌మోష‌న్స్‌ను చిత్ర యూనిట్ స్టార్ట్ చేసింది. అందులో భాగంగా మోష‌న్ పోస్ట‌ర్‌ను నాలుగు భాష‌ల్లో విడుద‌ల చేయ‌బోతున్నారు. తెలుగు, త‌మిళ భాష‌ల్లోని మోష‌న్ పోస్ట‌ర్‌ను యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్‌హాస‌న్ విడుద‌ల చేస్తుండ‌గా.. మ‌ల‌యాళ మోష‌న్ పోస్ట‌ర్‌ను మోహ‌న్ లాల్‌, హిందీ మోష‌న్ పోస్ట‌ర్‌ను స‌ల్మాన్‌ఖాన్ విడుద‌ల చేస్తున్నారు.

ర‌జ‌నీకాంత్  ఇప్పుడు 168వ చిత్రం కోసం సిద్ధ‌మ‌వుతున్నారు. డైరెక్టర్‌ శివ ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు.హీరోలను మాస్‌గా చూపించడంలో శివ స్పెషలిస్ట్‌. అందుకనే కోలీవుడ్‌ స్టార్‌ హీరో అజిత్‌ శివతో వరుసగా వీరం, వేదాళం, వివేకం, విశ్వాసమ్‌ సినిమాలను చేశాడు. ఇప్పుడు రజనీకాంత్‌తో శివ సినిమా అనగా మాస్‌ ఇమేజ్‌ ఉన్న రజనీకాంత్‌ను శివ ఎలా చూపిస్తాడో అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. రజనీకాంత్‌తో శివాజీ, రోబో చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్స్‌ ఈ సినిమాను నిర్మిస్తుండటం విశేషం. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరగుతున్నాయి. రజనీకాంత్‌తో మంజు వారియర్‌, కీర్తిసురేశ్‌ హీరోయిన్స్‌గా నటిస్తారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

Get Breaking News Alerts From IndiaGlitz