అట్టహాసంగా 'దర్బార్' మోషన్ పోస్టర్

  • IndiaGlitz, [Wednesday,November 06 2019]

సూపర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా స్టార్ డైరెక్ట‌ర్ ఎ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం 'ద‌ర్బార్‌'. న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టిస్తుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. జ‌న‌వ‌రి 10న ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ‌, మల‌యాళ‌, హిందీ భాష‌ల్లో విడుద‌ల చేయ‌బోతున్నారు. సినిమా ప్ర‌మోష‌న్స్‌ను చిత్ర యూనిట్ స్టార్ట్ చేసింది. అందులో భాగంగా మోష‌న్ పోస్ట‌ర్‌ను నాలుగు భాష‌ల్లో విడుద‌ల చేయ‌బోతున్నారు. తెలుగు, త‌మిళ భాష‌ల్లోని మోష‌న్ పోస్ట‌ర్‌ను యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్‌హాస‌న్ విడుద‌ల చేస్తుండ‌గా.. మ‌ల‌యాళ మోష‌న్ పోస్ట‌ర్‌ను మోహ‌న్ లాల్‌, హిందీ మోష‌న్ పోస్ట‌ర్‌ను స‌ల్మాన్‌ఖాన్ విడుద‌ల చేస్తున్నారు.

ర‌జ‌నీకాంత్ ఇప్పుడు 168వ చిత్రం కోసం సిద్ధ‌మ‌వుతున్నారు. డైరెక్టర్‌ శివ ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు.హీరోలను మాస్‌గా చూపించడంలో శివ స్పెషలిస్ట్‌. అందుకనే కోలీవుడ్‌ స్టార్‌ హీరో అజిత్‌ శివతో వరుసగా వీరం, వేదాళం, వివేకం, విశ్వాసమ్‌ సినిమాలను చేశాడు. ఇప్పుడు రజనీకాంత్‌తో శివ సినిమా అనగా మాస్‌ ఇమేజ్‌ ఉన్న రజనీకాంత్‌ను శివ ఎలా చూపిస్తాడో అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. రజనీకాంత్‌తో శివాజీ, రోబో చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్స్‌ ఈ సినిమాను నిర్మిస్తుండటం విశేషం. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరగుతున్నాయి. రజనీకాంత్‌తో మంజు వారియర్‌, కీర్తిసురేశ్‌ హీరోయిన్స్‌గా నటిస్తారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

More News

బాలయ్యకు విలన్‌గా మారుతున్న బాలీవుడ్ స్టార్‌?

నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయపాటి శ్రీను కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే.

కొత్త ద‌ర్శ‌కుడితో నాగ్‌.. అస‌లు ట్విస్ట్ అదే!

రియాలిటీ షో బిగ్‌బాస్ 3ను కింగ్ నాగార్జున విజ‌య‌వంతంగా పూర్తి చేశాడు. ఇప్పుడు ఆయ‌న త‌న ప్రాజెక్ట్స్‌పై ఫోకస్ పెట్టాడ‌ట‌.

నిర్మాత‌గా మారుతున్న మెగా డైరెక్ట‌ర్‌?

రీసెంట్‌గా మెగాస్టార్ చిరంజీవితో `సైరా న‌ర‌సింహారెడ్డి` సినిమాను డైరెక్ట్ చేసిన సురేంద‌ర్ రెడ్డి మెగా డైరెక్ట‌ర్‌గా గుర్తింపు సంపాదించుకున్నాడు.

శ్రీశైలంలో ప్రతిధ్వనిస్తున్న పురాణపండ శ్రీనివాస్ 'హరోంహర'

అంతర్గత శక్తులతో అత్యున్నత స్థాయికి తీసుకెళ్లే అద్భుత రచనలు చేయడంలో తన సృజనాత్మకతను ఒక పద్ధతి ప్రకారం పనిచేయించడంలో

భారీ యాక్ష‌న్ సీక్వెన్స్ పూర్తి చేసిన క‌మ‌ల్ హాస‌న్‌

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్, శంక‌ర్ కాంబినేష‌న్‌లో 23 ఏళ్ల త‌ర్వాత రూపొందుతోన్న చిత్రం `ఇండియ‌న్ 2`.