కమల్ హాసన్‌కు రేపు ఆపరేషన్

  • IndiaGlitz, [Thursday,November 21 2019]

ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమల్ హాసన్ రేపు ఆస్పత్రిలో చేరబోతున్నారు. ఆపరేషన్ (శస్త్రచికిత్స) కమల్ ఆస్పత్రిలో చేరుతున్నట్లు పార్టీ తరఫున ఓ ప్రకటనను విడుదలైంది. ఈ ప్రకటనలో అసలెందుకు ఆస్పత్రికి వెళ్లాల్సి వస్తోంది..? శస్త్ర చికిత్స ఎందుకు..? అనే విషయాలను సైతం నిశితంగా పార్టీ రాసుకొచ్చింది. ‘2016లో కమల్‌గారు ఓ ప్రమాదానికి గురయ్యారు.

అప్పట్లో కాలుకు చికిత్స చేసిన డాక్టర్లు ఇంప్లాంట్‌ను అమర్చారు. అయితే ఇప్పుడు దాన్ని తీసేసే టైమ్ వచ్చింది. ఆపరేషన్ తర్వాత కమల్ కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకుంటారు. ఈ శస్త్రచికిత్స గతంలోనే జరగాల్సి వుంది.. కానీ అయితే పార్టీ కార్యకలాపాల కారణంగా వాయిదా పడుతూ వచ్చింది’ అని పార్టీ ఉపాధ్యక్షుడు మహేంద్రన్ ఓ ప్రకటనలో వెల్లడించారు. ఇదిలా ఉంటే కమల్ శస్త్రచికిత్స సక్సెస్ కావాలని సోషల్ మీడియా వేదికగా కమల్ అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

More News

శిష్యుడి స్పీడుకు మ‌ణిశ‌ర్మ బ్రేకులు?

సీనియ‌ర్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ మ‌ణిశర్మ ఒక‌ప్పుడు స్టార్ మ్యూజిషియ‌న్‌గా స్టార్ హీరోలంద‌రి సినిమాల‌కు సంగీతం అందించిచాడు.

ల‌క్ష్మీ పార్వ‌తి సినీ రంగ ప్ర‌వేశం..క‌న్‌ఫ‌ర్మ్ చేసిన హీరోయిన్‌

స్వ‌ర్గీయ మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ స‌తీమ‌ణి ల‌క్ష్మీ పార్వ‌తి సినీ రంగ ప్ర‌వేశం చేయనున్నారు. ఈ విష‌యాన్ని హీరోయిన్ ముస్కాన్ క‌న్‌ప‌ర్మ్ చేసింది.

‘కమ్మరాజ్యం..’ పై కేఏ పాల్ హైకోర్టులో పిటిషన్

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన సంచలన చిత్రం ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమా వివాదాల్లో చిక్కుకుంది.

'నిశ్శ‌బ్దం' చిత్రంలో హాలీవుడ్ యాక్ట‌ర్ 'మైకేల్ మ్యాడ్‌స‌న్' లుక్

అనుష్క‌ శెట్టి, ఆర్‌.మాధ‌వ‌న్‌, అంజ‌లి, షాలిని పాండే ప్ర‌ధాన పాత్రధారులుగా తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ, ఇంగ్లీష్ భాష‌ల్లో రూపొందుతోన్న క్రాస్ ఓవ‌ర్ చిత్రం `నిశ్శ‌బ్దం`.

స్మగ్లరుగా మారనున్న అల్లు అర్జున్?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే.