క‌మ‌ల్‌, విక్ర‌మ్ సినిమా స్టార్ట‌యింది

  • IndiaGlitz, [Friday,August 31 2018]

విల‌క్షణ న‌ట‌న‌కు మారు పేరుగా క‌మ‌ల్ హాస‌న్ పేరును మ‌నం సూచిస్తుంటాం. త‌ర్వాత చియాన్ విక్ర‌మ్ ఆ రేంజ్‌లో క‌ష్ట‌ప‌డుతుంటారు. ఇప్పుడు వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో సినిమా రూపొంద‌నుంది. అయితే ఇద్ద‌రూ క‌లిసి న‌టించ‌డం లేదు. క‌మ‌ల్ హాస‌న్ స‌మ‌ర్ప‌ణ‌లో రాజ్‌క‌మ‌ల్ ఫిలిం ఇంట‌ర్నేష‌న్ బ్యాన‌ర్‌పై సినిమాను నిర్మించ‌బోతున్నారు.

ట్రైడెంట్ ఆర్ట్స్ బ్యాన‌ర్ కూడా సినిమా నిర్మాణంలో భాగ‌మ‌వుతుంది. విక్ర‌మ్ జోడిగా క‌మ‌ల్ త‌న‌య అక్ష‌ర హాస‌న్ న‌టిస్తుంది. చెన్నైలో సినిమా లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. శ్రీనివాస్ రెడ్డి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తుండ‌గా.. జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.