కమల్ హాసన్ ‘‘విక్రమ్’’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్.. సరికొత్త లుక్‌లో విలక్షణ నటుడు

  • IndiaGlitz, [Monday,March 14 2022]

విలక్షణ నటుడు కమల్ హాసన్ మరోసారి దూకుడు పెంచారు. యువ హీరోలకు పోటీగా ఆయన సినిమాలు తీస్తున్నారు. ప్రస్తుతం లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ‘‘విక్రమ్’’ మూవీ చేస్తున్నాడు. ఇళయ దళపతి విజయ్‌ నటించిన.. మాస్టర్‌ తర్వాత లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కమల్‌తో పాటు భారీ స్టార్ క్యాస్టింగ్ ఉండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో ఫహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి, నరేన్, కాళిదాస్ జయరామ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్లు , ఫస్ట్‌లుక్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దానికితోడు కమల్ హాసన్‌ను చాలా కొత్తగా చూపిస్తున్నాడు లోకేష్. ఈ నేపథ్యంలో మూవీ యూనిట్.. ‘‘విక్రమ్’’ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది.

మేకింగ్ వీడియో గ్లింప్స్‌తో పాటు విడుదల తేదీని ప్రకటించారు. జూన్ 3న వరల్డ్ వైడ్‌గా థియేటర్లలో విడుదల కానుంది ‘‘విక్రమ్’’. రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్‌లు సంయుక్తంగా విక్రమ్‌ను నిర్మిస్తున్నారు. లోకేష్‌తో కలిసి రత్నకుమార్ డైలాగ్స్ రాశారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించారు.

అయితే కమల్ నటించిన సినిమాలేవీ గత 15 ఏళ్లలో పెద్దగా ప్రభావం చూపించలేకపోయాయి. దశావతారం తర్వాత నటించిన విశ్వరూపం హిట్టైనా.. అది చాలా మందికి రీచ్ కాలేదు. ఈ సినిమాకు తెలుగులో కూడా మంచి బిజినెస్ జరుగుతున్నట్లుగా ఫిలింనగర్ టాక్. క‌మ‌ల్ హాస‌న్ న‌టిస్తోన్న 232వ చిత్ర‌మిది. ఈ సినిమాను పూర్తి చేయ‌డానికి క‌మ‌ల్ హాస‌న్ హోస్ట్ చేస్తూ వ‌చ్చిన త‌మిళ బిగ్ బాస్‌ను కూడా వ‌దులుకున్న సంగతి తెలిసిందే. మరి ఆయన ఆశలు ఎంత వరకు ఫలిస్తాయో వేచి చూడాలి.

More News

విషాదం: ‘రాధే శ్యామ్’‌కు మిక్స్‌డ్ టాక్ .. తట్టుకోలేక ప్రభాస్ అభిమాని ఆత్మహత్య

భారత్‌లో సినీతారలకు వున్న క్రేజ్ సాధారణమైంది కాదు. వారిని దైవంలా ఆరాధిస్తారు అభిమానులు. వాళ్ల ఒంటిపై ఈగ వాలనివ్వరు.

టాలీవుడ్‌లో మరో విషాదం.. గేయ రచయిత కందికొండ కన్నుమూత

తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ గేయ రచయిత కందికొండ కన్నుమూశారు. ఆయన వయసు 49 సంవత్సరాలు.

సమంతకు బౌన్సర్‌లా మారిన బాలీవుడ్ స్టార్ హీరో.. వీడియో వైరల్

సినీ తారలంటే జనాల్లో వున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులోనూ హీరోయిన్లంటే యువత మరింత ఉత్సాహం చూపిస్తారు.

హీరో విజయ్ దేవరకొండ చేతుల మీదుగా ‘‘చోర్ బజార్’’ చిత్రం నుంచి మెలోడీ గా సాగే 'జడ' లిరికల్ సాంగ్ విడుదల

ఆకాష్ పూరీ హీరోగా నటిస్తున్న సినిమా ‘‘చోర్ బజార్’’. గెహన సిప్పీ నాయికగా నటిస్తోంది. దళం, జార్జ్ రెడ్డి సినిమాలతో తన మార్కు క్రియేట్ చేసుకున్న జీవన్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించారు.

"డిస్నీ ప్లస్ హాట్ స్టార్" లో ఖిలాడి

"డిస్నీ ప్లస్ హాట్ స్టార్" ఆడియన్స్ కోసం ఫామిలీ ప్యాక్ లాంటి ఎంటర్ టైన్మెంట్ తో వచ్చాడు మాస్ మహారాజా రవితేజ. దాని పేరు "ఖిలాడి". స్ట్రీమింగ్ మొదలైంది.