close
Choose your channels

మిలిటరీ ట్రైనింగ్ అకాడమీలో కమల్ 'విశ్వరూపం 2'

Friday, December 1, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా విశ్వరూపం 2` (హిందీలో విశ్వరూప్ 2). ఈ మూవీ షూటింగ్ తిరిగి చెన్నైలో మొదలైంది. స్వీయదర్శకత్వంలో నటిస్తున్న ఈ స్పై థ్రిల్లర్ ఫిలింలో కమల్ ఒక స్పై ఏజెంట్ గా కనిపించబోతున్నారు. ఆఖరి షెడ్యూల్ ని చెన్నైలో గల ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (ఓటిఎ)లో చిత్రీకరిస్తున్నారు.

ఈ అకాడమీలో ఈ సినిమా చివరి షెడ్యూల్ ని షూట్ చేయడం చాలా ఆనందంగా, గర్వంగా కూడా ఉందని చెప్తూ కొంత మంది ఆఫీసర్స్ తో ఫొటోస్ కూడా దిగారు కమల్. లేడీ ఆఫీసర్స్ ని ట్రైన్ చేసే ఏకైక అకాడమీ చెన్నై లో మాత్రమే ఉందని, ఇక్కడున్న లేడీ ఆఫీసర్స్ తో పాటు భారత్ మాతాకి జై అంటూ మా తుజ్హే సలాం అని ఫొటోస్ తో ఈ ట్వీట్ ని కూడా తన ట్విట్టర్ ఖాతాలో ఉంచారు.

తమిళ్, తెలుగు, హిందీలో ఏక కాలంలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో శేఖర్ కపూర్, రాహుల్ బోస్, పూజాకుమార్ లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీని తొందరలోనే ఖరారు చేస్తారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.