ముగ్గురు హీరోయిన్స్‌తో క‌మ‌ల్ హాస‌న్‌

  • IndiaGlitz, [Tuesday,May 26 2020]

లోక నాయ‌కుడు క‌మ‌ల్‌హాస‌న్ ఇప్పుడు ‘ఇండియ‌న్ 2’ సినిమా చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా చిత్రీకరణ ముగియక ముందే లొకేషన్లో ప్రమాదం జరగడం, ఆ గొడ‌వ స‌ద్దుమ‌ణ‌గ‌క ముందే క‌రోనా ప్రభాం ప్రారంభం కావ‌డంతో సినిమా షూటింగ్స్ ఆగిపోయాయి. దీంతో ఓ ద‌శ‌లో ఇండియ‌న్ 2 సినిమా షూటింగ్ ఆగిపోయిందంటూ వార్త‌లు కూడా వినిపించాయి. అయితే లైకా సంస్థ సినిమా లొకేష‌న్ మార్చి చిత్రీక‌ర‌ణ‌కు ప్లాన్ చేస్తున్న‌ట్లు స‌మాచారం.

దీని త‌ర్వాత క‌మ‌ల్‌హాస‌న్ ‘త‌లైవ‌న్ ఇరిక్కిరాన్’ అనే సినిమాలో న‌టించ‌బోతున్నాడ‌ని స‌మాచారం. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ ప‌నులు ప్రారంభ‌మ‌య్యాయ‌ట‌. అంతే కాకుండా విల‌క్షణ న‌టుడు విజ‌య్ సేతుప‌తి కూడా ఇందులో ఓ కీల‌క పాత్ర‌లో న‌టించ‌బోతున్నాడ‌ని అంటున్నారు. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ఈ చిత్రంలో క‌మ‌ల్ హాస‌న్ జ‌త‌గా ముగ్గురు హీరోయిన్స్ న‌టించ‌బోతున్నార‌ని టాక్‌. అందులో క‌మ‌ల్ హాస‌న్ ‘క్ష‌త్రియ పుత్రుడు’లో నటించిన సీనియర్‌ తార రేవతి ఒకరు కాగా, ‘విశ్వరూపం’లో నటించిన పూజా కుమార్‌, ఆండ్రియా ఈ చిత్రంలో నటించనున్నట్టు కోలీవుడ్‌ టాక్‌. క‌రోనా ప్ర‌భావం త‌గ్గిన త‌ర్వాత ఈ సినిమాకు సంబంధించిన ప‌నులను ముమ్మ‌రం చేయ‌బోతున్నార‌ట‌.

More News

లిక్కర్ షాప్‌‌కు వెళ్లాలి సాయం చేయండని సోనూసూద్‌ను అడగ్గా..

కరోనా మహమ్మారి కాటేస్తున్న తరుణంలో సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార రంగాలకు ప్రముఖులు తమ వంతుగా సాయం చేయడానికి ముందుకొచ్చిన విషయం విదితమే.

శ్రీవారిని నమ్మే భక్తురాలిగా చెబుతున్నా ఆలోచించండి!

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల వెంకన్న ఆస్తుల విక్రయం అంశం ఏపీలో తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే.

ఆస్తుల అమ్మకాలపై టీటీడీ వెనక్కి తగ్గిన జగన్ సర్కార్!

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల శ్రీవారి సన్నిధికి చెందిన నిరర్ధక భూములను అమ్మేయాలని టీటీడీ నిర్ణయించిన విషయం తెలిసిందే.

పవన్‌తో బండి సంజయ్ భేటీ.. ఏమేం చర్చించారు!?

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత బండి సంజయ్ తనదైన శైలిలో ముందుకు దూసుకెళ్తున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కానీ.. పార్టీని బలోపేతం చేయడానికి సాయశక్తులా

శ్రీవారి ఆస్తులను నిరర్థకం అనడం అవమానించడమే : పవన్

దక్షిణాది రాష్ట్రాల్లోనే కాకుండా ఉత్తరాది రాష్ట్రాల్లోనూ భక్తులు తిరుమల వెంకన్న ఆస్తులు సమర్పించుకున్నారని.. వారు ఎంతో భక్తితో ఇచ్చిన ఆస్తికి నిరర్థకం అనే ప్రశ్నే ఉండకూడదని