బలపరీక్ష ఎదుర్కోకుండానే కమల్‌నాథ్ రాజీనామా

  • IndiaGlitz, [Friday,March 20 2020]

బలపరీక్షకు ముందే మధ్యప్రదేశ్‌ సీఎం కమల్‌నాథ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ సాయంత్రం 5గంటలకు బలపరీక్ష జరగనుంది. అయితే.. బలపరీక్ష ఎదుర్కోకుండానే కమల్‌నాథ్ రాజీనామా చేసేశారు. ఆయన నిర్ణయం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రాజీనామా లేఖను తీసుకొని ఆయన నేరుగా గవర్నర్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రాజీనామా లేఖను సమర్పించనున్నారు. అంతకుముందు కమల్‌నాథ్‌ తన నివాసంలో పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న తాజా పరిస్థితులపై చర్చించారు.

సంచలన వ్యాఖ్యలు

‘బీజేపీ నాకు వ్యతిరేకంగా కుట్ర పన్నింది. రాష్ట్రాభివృద్ధి కోసం పాటు పడ్డాను. ఈ 15 నెలల్లో నేను చేసిన తప్పేంటి?. ఐదేళ్లు పాలించాలని నాకు ప్రజలు అధికారమిచ్చారు. అత్యాశపరులైన మా ఎమ్మెల్యేలతో బీజేపీ చేతులు కలిపింది. 15 ఏళ్లలో బీజేపీ చేయలేనిది నేను 15 నెలల్లో చేశాను. ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తూనే ఉంది. బెంగళూరులో ఎమ్మెల్యేలను నిర్బంధించడం వెనుక ఉన్న అసలు నిజమేంటో దేశ ప్రజలు త్వరలోనే తెలుసుకుంటారు. అప్పుడే నిజానిజాలు బయటికి వస్తుంది. ప్రజలు వాళ్లను క్షమించరు’ అని కమల్‌నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

దెబ్బ కొట్టిన సింథియా..!

జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌కు ఊహించిన దెబ్బ కొట్టారు. పార్టీకి రాజీనామా చేసిన ఆయన అనంతరం బీజేపీ తీర్థం పుచ్చుకోగా.. కమలనాథులు ఆయన్ను రాజ్యసభకు పంపడం జరిగింది. జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పడంతో ఆయనకు మద్దతుగా ఆ పార్టీకి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో కమల్‌నాథ్ ప్రభుత్వానికి, కాంగ్రెస్‌కు గట్టి దెబ్బ తగిలినట్లయ్యింది. మొత్తానికి చూస్తే.. గత నెలరోజులుగా మధ్యప్రదేశ్‌‌లో నెలకొన్న రాజకీయ పరిణామాలకు హైడ్రామాకి ఎట్టకేలకు తెరపడిందని చెప్పుకోవచ్చు.

More News

యుద్ధాల కంటే ప్రమాదకరం.. 22న ఎవరూ బయటికి రావొద్దు!

మహమ్మారి కరోనా అంతకంతకూ వ్యాప్తి చెందుతుండడంతో అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ దేశ ప్రజలను సున్నితంగా హెచ్చరించారు. జాతిని ఉద్దేచించి గురువారం నాడు మోదీ మాట్లాడారు.

దేశ చరిత్రలో ఫస్ట్ టైం..: ఎట్టకేలకు నిర్భయ నిందితులకు ఉరి

దేశ రాజధాని ఢిల్లీలో పెను సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో నిందితులకు ఎట్టకేలకు ఉరిశిక్ష అమలు అయ్యింది. ఎన్నో ట్విస్ట్‌లు.. మరెన్నో వాయిదాలు.. ఇంకెన్నీ పిటిషన్ల మధ్య ఎట్టకేలకు శుక్రవారం తెల్లారుజామున

శ్రీవారి భక్తులారా సహకరించండి : టీటీడీ ఈవో

‘కరోనా’ మహమ్మారి కాటేస్తున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తీసుకున్న నిర్ణయాలకు భక్తులు సహకరించాలని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పేర్కొన్నారు. గురువారం నాడు సాయంత్రం విలేకరుల సమావేశంలో

జెన్నిఫర్.. మీ త్యాగానికి ప్రపంచం హ్యాట్సాఫ్!

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న తరుణంలో.. ఆ పేరెత్తితేనే వణికిపోతున్న క్రమంలో..  మందులు లేకుండా శవాలు గుట్టల్లా తేలుతున్న సందర్భంలో.. నాపైన టెస్ట్‌లు చేసి మందు కనిపెట్టండి..

ఇంటర్నేషనల్ ఫ్లైట్స్‌పై నిషేధం: ఎవరూ బయటికి రావొద్దు!

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మరి గంటగంటకూ విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు చేపడుతున్నాయి. ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వాలకు