Download App

అభిమానులా.. మజాకా... రివ్యూ రైటర్ అకౌంట్ క్లోజ్

బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా సెలెబ్రిటీలను విమర్శిండమే పనిగా పెట్టుకునే రివ్యూ  రైటర్ కమల్ ఆర్ ఖాన్.

బాలీవుడ్ రివ్యూ రైటరే కానీ  తెలుగు సినిమాలను కూడా వదలరు. జాతీయ స్థాయిలో ఎందరో మెప్పు పొందిన బాహుబలి సినిమానూ విమర్శించారు. మహేశ్ బాబు, పవన్ కల్యాణ్‌ను కూడా వదల్లేదు. రీసెంట్ గా మహాభారతం సినిమాకి మోహన్ లాల్ భీముడి పాత్రకి సరిపోడని, చోటా భీమ్ లా ఉంటాడని విమర్శించి, మోహన్ లాల్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు.
 
ఇటీవల అమీర్ ఖాన్ హీరోగా నటించిన సీక్రెట్ సూపర్ స్టార్ సినిమా క్లైమాక్స్‌ను రివీల్ చేస్తూ విడుదలకు ముందే సోషల్ మీడియాలో రివ్యూ రాశారు. ఆగ్రహం కట్టలు తెంచుకున్న అమీర్ ఖాన్ అభిమానులు ట్విట్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో కమల్ ట్విట్టర్ అకౌంట్‌ను నిర్వాహకులు నిలిపివేశారు.

సూపర్ స్టార్ అభిమానులా.. మజాకా... ?