close
Choose your channels

మార్చి 5న 'కణం' ప్రీ రిలీజ్ ఫంక్షన్

Thursday, March 1, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

'ఛలో'తో సూపర్‌హిట్‌ కొట్టిన నాగశౌర్య, 'ఫిదా', 'ఎంసిఎ' వంటి సూపర్‌హిట్స్‌ ఇచ్చిన సాయిపల్లవి కలిసి ఎన్‌.వి.ఆర్‌. సినిమా సమర్పణలో లైౖకా ప్రొడక్షన్స్‌ పతాకంపై విజయ్‌ దర్శకత్వంలో నిర్మిస్తున్న 'కణం' చిత్రంలో జంటగా నటిస్తున్నారు. షూటింగ్‌ పూర్తయిన 'కణం' చిత్రం ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ మార్చి 5న హైదరాబాద్‌లో జరగనుంది. ఈ ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని ఎన్‌విఆర్‌ సినిమా అధినేత చెప్పారు.

'కణం' ఎంతో ఇష్టపడి చేసిన సినిమా - సాయిపల్లవి : ''ఫిదా', 'ఎంసిఎ' చిత్రాల్ని అపూర్వంగా ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. 'కణం' చిత్రం తల్లి, కూతురికి మధ్య ఉండే భావోద్వేగాల ఆధారంగా ఉంటుంది. నేను ఏదైనా సినిమా చేస్తున్నప్పుడు అందులో నా పాత్రకి ఎలా న్యాయం చేయగలను అనేది చూసుకుంటాను. విజయ్‌గారు ఈ కథ చెప్పి, ఇందులో నేను తల్లి పాత్ర చేయాలి అని అడిగినప్పుడు ఈ పాత్రలోని ఎమోషన్స్‌ని పండించగలనా అనుకున్నాను. ఎందుకంటే ఇలాంటి పాత్ర ఇది వరకు నేను చేయలేదు. విజయ్‌ గారు, నేను సినిమా గురించి చాలా చర్చించుకున్నాం.

చిత్రంలో నా కూతురిగా కనిపించే వెరోనికాతో చాలా సమయం గడిపాను. తాను నేను నిజంగానే తల్లి, కూతుర్లలాగ కలిసిపోయాం. అందువల్ల సినిమాలో కనిపించే ఎమోషన్స్‌ అన్ని చాలా సహజంగా ఉంటాయి. దర్శకుడు విజయ్‌గారు ఎంతో సహకారం అందించారు. తనకి ఏమి కావాలో స్పష్టంగా తెలిసిన దర్శకుడు ఉన్నప్పుడు మన పని సులువు అయిపోతుంది. విజయ్‌గారికి ఏ సీన్‌కి ఎలాంటి ఎమోషన్‌ ఉంటే బావుంటుందో బాగా తెలుసు. తల్లి-కూతురి మధ్య సన్నివేశాలు కొంచెం లౌడ్‌గా ఉంటే బాగా పండుతాయి అని అనుకునేదాన్ని. కానీ విజయ్‌గారు సహజంగా ఉండాలనేవారు. ఈ విషయంలో విజయ్‌గారి తో 'నన్ను మీరు యాక్ట్‌ చేయనివ్వట్లేదు' అని కూడా అనేదాన్ని (నవ్వుతూ). కానీ డబ్బింగ్‌ సమయంలో సినిమా చూస్తున్నప్పుడు అర్థమైంది ఆయన ఎందుకలా అనేవారో. నటిగా ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకమైంది. పాత్రని ఎంతో ఇష్టపడి చేసాను.'' అన్నారు.

ఈ చిత్రానికి నిరవ్‌షా, శ్యామ్‌ సి.ఎస్‌., ఎల్‌.జయశ్రీ, స్టంట్‌ సిల్వ, ఆంటోని, విజయ్‌, సత్య, పట్టణం రషీద్‌, ఎం.ఆర్‌.రాజకృష్ణన్‌, కె.మణివర్మ, రామసుబ్బు, సప్న షా, వినయదేవ్‌, మోడేపల్లి రమణ, కె.భార్గవి, ప్రత్యూష, ఎస్‌.ఎం.రాజ్‌కుమార్‌, ఎస్‌.శివశరవణన్‌, షియామ్‌ పనిచేస్తున్న సాంకేతికవర్గం. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎస్‌.ప్రేమ్‌, సమర్పణ: ఎన్‌.వి.ఆర్‌. సినిమా, నిర్మాణం: లైకా ప్రొడక్షన్స్‌, దర్శకత్వం: విజయ్‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.