కాంచ‌న రీమేక్ 'ల‌క్ష్మీ బాంబ్' ఫ‌స్ట్ లుక్‌

  • IndiaGlitz, [Saturday,May 18 2019]

న‌టుడు, ద‌ర్శ‌కుడు, నిర్మాత అయిన రాఘవ లారెన్స్ ఇప్పుడు బాలీవుడ్‌ డైరెక్ట‌ర్‌గా మారాడు. త‌ను న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన 'కాంచ‌న' సినిమాని హిందీలో 'ల‌క్ష్మీబాంబ్‌'గా రీమేక్ చేస్తున్నాడు. హిందీలో అక్ష‌య్‌కుమార్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణ‌లో నిర్మిత‌మ‌వుతోన్న ఈ సినిమాలో కియరా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తుంది.

ఈరోజు సినిమా ఫ‌స్ట్ లుక్‌తో పాటు సినిమా రిలీజ్ డేట్‌ను కూడా అనౌన్స్ చేశారు. వ‌చ్చే ఏడాది అంటే 2020 జూన్ 5న సినిమా విడుద‌ల కానుంది. ఫ‌స్ట్ లుక్‌లో అక్ష‌య్ క‌ళ్ల‌కు కాటుక పెట్టుకుంటూ క‌న‌ప‌డ్డారు. మంచి క‌థ‌ను మీకు చూపించ‌బోతున్నామంటూ అక్ష‌య్ కుమార్ ట్వీట్ చేయ‌గా.. అక్ష‌య్ వంటి హీరోతో సినిమా చేస్తుండ‌టం ఆనందంగా ఉంద‌ని కియ‌రా అద్వానీ కూడా ట్వీట్ చేయ‌డం విశేషం