జాతీయ అవార్డ్ కోసం కంచె తో పోటీపడిన తెలుగు చిత్రాలివే

  • IndiaGlitz, [Monday,March 28 2016]

వ‌రుణ్ తేజ్ - ప్ర‌గ్యాజైస్వాల్ జంట‌గా క్రిష్ తెర‌కెక్కించిన చిత్రం కంచె. రెండ‌వ ప్ర‌పంచ యుద్ధం నేప‌ధ్యంతో రూపొందిన కంచె సినిమా క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ సాధించ‌డంతో పాటు జాతీయ ఉత్త‌మ తెలుగు సినిమా అవార్డ్ ను కూడా సొంతం చేసుకుంది. జాతీయ స్ధాయిలో ఉత్త‌మ తెలుగు చిత్రం అవార్డ్ కోసం కంచె సినిమాతో పాటు ప‌లు తెలుగు సినిమాలు పోటీప‌డ్డాయి.
ఇంత‌కీ... కంచె మూవీతో ఏయే చిత్రాలు పోటీప‌డ్డాయంటే... కృష్ణ‌మ్మ క‌లిపింది ఇద్ద‌రినీ, ల‌జ్జ‌, బాహుబ‌లి, రుద్ర‌మ‌దేవి, క‌ల‌యా..నిజ‌మా, దాన వీర శూర క‌ర్ణ‌, భ‌లే భ‌లే మ‌గాడివోయ్, జ్యోతిల‌క్ష్మి, ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం, శ్రీమంతుడు, బ‌డుగు చిత్రాలు పోటీప‌డ్డాయి. ఈపోటీలో క్రిష్ కంచె సినిమా జాతీయ అవార్డ్ ను సొంతం చేసుకోవ‌డం విశేషం.

More News

ఏప్రిల్ 1న 'అప్పుడలా ఇప్పుడిలా' విడుదల

సూర్యతేజ,హర్షికి పూనాచా హీరో హీరోయిన్లుగా జంపా క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం ‘అప్పుడలా ఇప్పుడిలా’.

చిరు - ప‌వ‌న్ ఫ్యాన్స్ గొడ‌వ ఒక‌రు మృతి..

మెగాస్టార్ చిరంజీవి - ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్న‌ద‌మ్ములిద్ద‌రూ..స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ ఆడియో వేడుక‌లో క‌ల‌వ‌డంతో ఫ్యాన్స్ పండ‌గే చేసుకున్నారు.

క్రిష్ కంచె కి జాతీయ అవార్డ్ - ఆనందంలో వ‌రుణ్ తేజ్..

గ‌మ్యం సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మై...తొలి చిత్రంతోనే అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన అభిరుచిగ‌ల ద‌ర్శ‌కుడు క్రిష్. గ‌మ్యం ఆత‌ర్వాత‌ వేదం, కృష్ణ‌మ్ వందేజ‌గ‌ద్గురుమ్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన క్రిష్ తాజా చిత్రం కంచె.

63వ జాతీయ అవార్డు వివ‌రాలు..

ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌న సృష్టించిన తెలుగు సినిమా బాహుబలి. ప్ర‌భాస్, అనుష్క, త‌మ‌న్నా, రానా, ర‌మ్య‌కృష్ణ‌, స‌త్య‌రాజ్ ప్ర‌ధాన తారాగ‌ణంగా రాజ‌మౌళి తెర‌కెక్కించిన బాహుబ‌లి చిత్రం 600 కోట్లు వ‌సూలు చేసిన విష‌యం తెలిసిందే.

త‌మ‌న్నా స‌క్సెస్ చూసి బాధ‌ప‌డుతున్న శృతిహాస‌న్..

నాగార్జున - కార్తీ - త‌మ‌న్నా క‌ల‌సి న‌టించిన చిత్రం ఊపిరి. ఈ సినిమా త‌మిళ్ లో తోళా అనే టైటిల్ తో రిలీజైంది. ఈ సినిమా ఇటు తెలుగు - అటు త‌మిళ్ లో ఘ‌న విజ‌యం సాధించింది.