close
Choose your channels

జ‌య‌ల‌లిత‌గా కంగ‌నా ర‌నౌత్‌

Saturday, March 23, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

జ‌య‌ల‌లిత‌గా కంగ‌నా ర‌నౌత్‌

త‌మిళ‌నాడు దివ‌తంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లితకు సంబంధించి మూడు బ‌యోపిక్స్‌ను అనౌన్స్ చేశారు. అందులో సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు భార‌తీరాజా ఓ బ‌యోపిక్‌ని రూపొందిస్తుండ‌గా, ప్రియ‌ద‌ర్శిని అనే మ‌హిళా ద‌ర్శ‌కురాలు తెర‌కెక్కిస్తున్న బ‌యోపిక్ `ది ఐర‌న్ లేడీ`లో నిత్యామీన‌న్ అమ్మ పాత్ర‌లో న‌టిస్తుంది. ఈ రెండు కాకుండా విబ్రి మీడియా కూడా జ‌య‌ల‌లిత‌పై ఓ బ‌యోపిక్‌ను అనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే.

ఎ.ఎల్‌.విజ‌య్ ద‌ర్శ‌కుడు. . దీనికి విజయేంద్ర ప్ర‌సాద్ క‌థ‌ను అందిస్తుండ‌గా, జి.వి.ప్ర‌కాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో జ‌య‌ల‌లిత‌గా ఎవ‌రు క‌నిపిస్తార‌నే దానిపై ప‌లు ర‌కాల వార్త‌లు విన‌ప‌డుతూ వ‌చ్చాయి. అయితే ఇప్పుడు జ‌య‌ల‌లిత‌గా కంగ‌నా ర‌నౌత్ న‌టించ‌నున్నారు. అగ్రిమెంట్ కూడా పూర్త‌య్యింది. అధికారిక స‌మాచారం మాత్ర‌మే రావాల్సి ఉంద‌ట‌. త్వ‌ర‌లోనే మిగిలిన వివ‌రాల‌ను వెల్ల‌డిస్తారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.