ద‌ర్శ‌కుడి విష‌యంలో మ‌రోసారి కంగ‌నా క్లారిటీ

  • IndiaGlitz, [Thursday,August 30 2018]

కంగ‌నా ర‌నౌగ్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం 'మ‌ణిక‌ర్ణిక‌'. జాగ‌ర్ల‌మూడి క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా స్టార్ట‌య్యింది. సినిమా అంతా పూర్త‌య్యింది. కానీ ప్యాచ్ వ‌ర్క్ విష‌యానికి క్రిష్ మ‌ణిక‌ర్ణిక‌కు స‌మ‌యం కేటాయించ‌లేక‌పోతున్నాడు. అందువ‌ల్ల కంగ‌నా విజ‌యేంద్ర ప్ర‌సాద్‌, ద‌ర్శ‌క‌త్వ శాఖ‌తో క‌ల‌సి ప్యాచ్ వ‌ర్క్‌ను పూర్తి చేస్తుంది. ఇటీవ‌ల క్రిష్‌, కంగనా మ‌ధ్య చెడింది. అందుకే క్లాప్ బోర్డ్‌పై కూడా డైరెక్ట‌ర్ స్థానంలో కంగనా పేరే క‌న‌ప‌డుతుద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్న నేప‌థ్యంలో కంగ‌నా ఇన్‌స్టాగ్రామ్‌లో రూమ‌ర్స్‌కు బ‌దులిచ్చింది.

క్రిష్‌నే సినిమాకు ద‌ర్శ‌కుడని తెలియేసింది. త‌ను వేరే సినిమాతో బిజీగా ఉండ‌టంతో త‌నే ప్యాచ్ వ‌ర్క్‌ను పూర్తి చేస్తున్నాన‌ని కూడా తెలిపింది. ప్ర‌థ‌మ స్వాంతంత్ర్య స‌మ‌రంలో బ్రిటీష్ వారిని ఎదిరించిన ఝాన్సీ ల‌క్ష్మీబాయ్ జీవిత చ‌రిత్రే ఈ సినిమా.

ఈ సినిమాను ఈ ఏడాది ఆగ‌స్టులో విడుద‌ల చేయాల‌నుకున్నారు.. రీ షూట్స్ చేయ‌డం.. గ్రాఫిక్ వ‌ర్క్ అనుకున్నంత వేగంగా పూర్తి కాక‌పోవ‌డం వంటి కార‌ణాల‌తో సినిమా విడుద‌ల ఆల‌స్య‌మ‌వుతుంది. స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమాను 2019 జ‌న‌వ‌రి 25న విడుద‌ల చేస్తున్నారు.

More News

అఫీషియ‌ల్‌... వెన‌క్కి వెళ్లిన సూర్య‌

తమిళ‌నాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు ఉన్న త‌మిళ హీరో సూర్య‌. ఆయ‌న హీరోగా  ఇప్పుడు సెల్వ‌రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్‌.జి.కె(నంద‌గోపాల‌కృష్ణ‌) సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఘనంగా పేపర్ బాయ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్

ప్రముఖ దర్శకుడు సంపత్ నంది నిర్మాతగా సంతోష్ శోభన్ , రియా సుమన్ మరియు తాన్య హోప్ ప్రధానపాత్రల్లో వస్తున్న చిత్రం 'పేపర్ బాయ్'..

నంద‌మూరి హ‌రికృష్ణ మృతికి సంతాపం తెలిపిన డా.రాజ‌శేఖ‌ర్‌, జీవిత‌

న‌టుడు, తెలుగుదేశం నేత నంద‌మూరి హ‌రికృష్ణ కారు ప్ర‌మాదంలో మ‌ర‌ణించారు. ఆయ‌న మ‌ర‌ణం నంద‌మూరి అభిమానుల‌ను , టీడీపీ శ్రేణుల‌కు తీర‌ని లోటు.

అభిమానుల‌కు హ‌రికృష్ణ చివ‌రి లేఖ‌...

సెప్టెంబ‌ర్ 2న హ‌రికృష్ణ పుట్టిన‌రోజు ఈ సంద‌ర్భంగా.. త‌న‌కు అభిమానులు, స్నేహితులు ఎవ‌రైనా పుట్టిన‌రోజు సెల‌బ్రేష‌న్స్ చేయ‌వద్ద‌ని.

హ‌రికృష్ణ చివ‌రి మాట‌లు...

ఇండ‌స్ట్రీలో నంద‌మూరి హ‌రికృష్ణ తమ్ముడూ! అని ఆప్యాయంగా పిలుచుకునే వ్య‌క్తి నాగార్జున అక్కినేని. ఎన్టీఆర్‌, ఎ.ఎన్‌.ఆర్ క‌లిసి మెలిసి ఉండే అనుబంధంతో పిల్ల‌ల మ‌ధ్య కూడా మంచి అనుబంధం ఏర్పడింది.