గాంధీ, నెహ్రులను విమర్శించిన కంగనా రనౌత్‌

  • IndiaGlitz, [Saturday,October 31 2020]

శనివారం ఐరన్‌మ్యాన్‌ సర్దార్ వల్లబాయ్‌ పటేల్‌ జయంతి. ఈ సందర్భంగా దేశంలోని నాయకులందరూ ముఖ్యంగా బీజేపీ నాయకులు ఆయనకు నివాళులు అర్పించారు. సినీ రంగం వైపు నుండి చూస్తే ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ నివాళులు అర్పించింది. తనదైన పంథాలో ఓవైపు సర్దార్‌ వల్లబాయ్‌ పటేల్‌ను పొడుగుతూనే గాంధీ, నెహ్రులను విమర్శించింది కంగనా. కేవలం గాంధీ కోసం, ఆయన్ని సంతోషపెట్టడానికి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ ప్రధాని పదవిని వదులుకున్నారు. కానీ ఆ నిర్ణయం వల్ల ఆయనేం బాధపడలేదు. కాఈ దేశం కొన్ని దశాబ్దాల పాటు బాధపడింది.

మనకు దక్కాల్సిన దాన్ని ఏ పరిస్థితుల్లోనూ వదులుకోకూడదు. వల్లభాయ్‌ పటేల్‌ ఉక్కు మనిషి, అయినా నెహ్రువంటి బలహీనవైన మనస్తత్వం ఉన్న వ్యక్తిని గాంధీ ప్రధాని చేయాలనుకున్నారు. అయితే గాంధీ మరణించిన తర్వాత పరిస్థితి ఘోరంగా తయారయ్యింది. భారత ఉక్కు మనిషి వల్లభాయ్‌ పటేల్‌కు జయంతి శుభాకాంక్షలు. మీరు అఖండ భారతదేశాన్ని అందించారు. ప్రధాని పదవిని వదులుకోవడం వల్ల మీ నాయకత్వాన్ని మాకు మీరు దూరం చేశారు. మీ నిర్ణయంపై మేం చింతిస్తున్నాం అంటూ ట్విట్ట్రర్‌ వేదికగా కంగనా తన భావాలను వెల్లడించింది. మరి కంగనా వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు ఎలా స్పందిస్తాయో చూడాలి.

More News

నగల దొంగను పట్టిచ్చిన వాట్సాప్...

దొంగతనం జరిగిన 15 నెలల తరువాత దొంగ అనూహ్యంగా పట్టుబట్టాడు. ఈ దొంగతనం కేసును పోలీసులు ఛేదించలేదు.

హాట్ టాపిక్‌గా రోజా, బండ్ల గణేష్ ఫోటో..

ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా, నిర్మాత బండ్ల గణేష్.. ఓ ప్రైవేటు కార్యక్రమంలో కలిశారు. ఇద్దరూ మనస్ఫూర్తిగా నవ్వుతూ ఫోటోకు ఫోజులిచ్చారు.

అలవోకగా నా కెమెరా కంటికి చిక్కింది : చిరంజీవి

లాక్‌డౌన్‌ ప్రారంభమైనప్పటి నుంచి సినిమా షూటింగ్‌లు లేకపోవడంతో మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా గడిపేస్తున్నారు.

వైభవంగా పంచదార బొమ్మ కాజల్ వివాహ వేడుక..

పంచదార బొమ్మ కాజల్ వివాహ వేడుక వైభవంగా జరిగింది. తన స్నేహితుడు, వ్యాపారవేత్త అయిన గౌతమ్ కిచ్లుతో ఆమె వివాహం శుక్రవారం రాత్రి జరిగింది.

అభి, అఖిల్, మోనాల్.. కథ మళ్లీ మొదలైందా!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సాంగ్‌తో షో స్టార్ట్ అయింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఒక సభ్యుడిని బిగ్‌బాస్ పంపించారు.