close
Choose your channels

కంగ‌నా రివ‌ర్స్ వార్నింగ్‌..

Friday, January 18, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కంగ‌నా రివ‌ర్స్ వార్నింగ్‌...

సినిమా వాళ్లు బెదిరిస్తే బెదిరిపోతారు అనుకుంటే పొర‌పాటే అంటుంది కంగ‌నా ర‌నౌత్‌. ఈమె టైటిల్ పాత్ర‌లో న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం `మణిక‌ర్ణిక‌`. ఈ నెల 25న సినిమా విడుద‌ల‌వుతుంది. సినిమాలో ఝాన్సీ పాత్ర బ్రిటీష్ అధికారితో ప్రేమ‌లో ప‌డ్డ‌ట్టు చూపించార‌ని, ఆ స‌న్నివేశాల‌ను తొల‌గించ‌క‌పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కొవాల‌ని క‌ర్ణిసేన హెచ్చ‌రించింది.

దీనిపై కంగనా కూడా ఘాటుగానే స్పందించింది. మీడియా ద్వారా కంగ‌నా స్పందిస్తూ..``సినిమాకు న‌లుగురు చ‌రిత్రకారులు ఆమోదం తెలిపారు. సెన్సార్ బోర్డ్ స‌ర్టిఫికేట్ ఇచ్చింది. నేను కూడా రాజ్‌పుత్‌నే. ఆందోళ‌న‌లఉ ఆప‌క‌పోతే నేను కూడా వారిలాగే ప్ర‌వ‌ర్తించాల్సి ఉంటుంది. వారంద‌రినీ నాశనం చేస్తాను`` అన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.