అనుష్క వల్ల కంగనా భయపడుతోందా?

  • IndiaGlitz, [Saturday,September 21 2019]

టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్‌లో ఒక‌రైన అనుష్క‌..బాలీవుడ్ క్వీన్ కంగ‌నా ర‌నౌత్‌ను భ‌య‌పెట్టిందా? అవున‌నే అంటున్నాయి సినీ వ‌ర్గాలు. ఇంత‌కు కంగనాను అనుష్క ఏ విష‌యంలో భ‌య‌పెట్టిందో తెలుసా? వెయిట్ పెర‌గ‌డంలో.. ఐదేళ్ల క్రితం అనుష్క, తాను న‌టించిన 'సైజ్ జీరో' కోసం బ‌రువు పెరిగింది. కానీ ఆ త‌ర్వాత అనుష్క త‌న బిజీ షెడ్యూల్‌తో ఆ బ‌రువు సాధార‌ణంగా త‌గ్గించుకోలేక‌పోయింది. వ‌రుస సినిమాల్లో న‌టించ‌డం త‌దిత‌ర కార‌ణాల‌తో ఫిజిక్‌పై ఫుల్‌గా ఫోకస్ పెట్ట‌లేక‌పోయింది అనుష్క శెట్టి. 'భాగ‌మ‌తి' త‌ర్వాత ఏడెనిమిది నెల‌లు గ్యాప్ తీసుకుని మరీ స‌న్న‌బడాల్సి వ‌చ్చింది అనుష్క‌. ఇప్పుడు కంగ‌నా కూడా ఆ కోణంలోనే ఆలోచించిన‌ట్లుగా ఉంది.

ప్ర‌స్తుతం ఈమె త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత బ‌యోపిక్ 'త‌లైవి'లో న‌టించ‌నుంది. ఇందులో పాత్ర కోసం ఆమెను ద‌ర్శ‌కుడు ఎ.ఎల్‌.విజ‌య్ కాస్త బ‌రువు పెర‌గ‌మ‌న్నాడ‌ట‌. అయితే తాను బ‌రువు పెర‌గ‌న‌ని, కావాల్సి వ‌స్తే ప్రాస్థ‌టిక్ మేక‌ప్ వేసుకుంటాన‌ని చెప్ప‌ది. 'మ‌ణిక‌ర్ణిక‌' సినిమా కోసం రిస్కీ క‌త్తి యుద్ధాలు, గుర్ర‌పుస్వారీలు నేర్చుకున్న కంగ‌నా.. బ‌రువు పెరిగే విషయంలో మాత్రం రిస్క్ తీసుకోద‌లుచుకోలేదు. కంగనా బ‌రువు పెర‌గ‌న‌ని చెప్పేయ‌డంతో ఇప్పుడు ద‌ర్శ‌కుడు ఎ.ఎల్.విజ‌య్ ఆమెను హాలీవుడ్ మేక‌ప్ మ్యాన్ కొలిన్ జాస‌న్స్ ద‌గ్గ‌ర‌కు తీసుకెళ్లాడు. జాస‌న్ కంగ‌నాకు ప్రాస్థ‌టిక్ మేక‌ప్ వేస్తున్నాడు. ఈ ఫొటోలు నెట్‌లో హ‌ల్ చేస్తున్నాయి.

More News

రెండు క్రేజీ ప్రాజెక్స్‌లోనూ త‌క్కువ పాట‌లే..

ప్ర‌స్తుతం టాలీవుడ్ బిగ్‌స్టార్స్ సినిమాలు ప్యాన్ ఇండియా చిత్రాలు విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్నాయి.

'దిమాక్ ఖ‌రాబ్...' వీడియో సాంగ్ దూకుడు

`ఇస్మార్ట్ శంక‌ర్‌` ఈ సినిమాపై విడుద‌ల‌కు ముందు వ‌ర‌కు కూడా పెద్ద‌గా అంచ‌నాలు లేవు. ఎందుకంటే అటు హీరో రామ్‌కైనా..

అక్టోబర్ 18 న  కృష్ణారావ్ సూప‌ర్‌ మార్కెట్ విడుదల

బిజెఆర్ ఫిల్మ్ అండ్ టివి స్టూడియోస్ బ్యాన‌ర్ పై ప్ర‌ముఖ క‌మెడియ‌న్ గౌతంరాజు కుమారుడు కృష్ణ హీరోగా రూపొందిన చిత్రం  'కృష్ణారావ్ సూప‌ర్‌మార్కెట్'.

ఎంపీ ఎఫెక్ట్.. ‘ఆదీ’.. మాకొద్దంటున్న బీజేపీ.. !?

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల అనంతరం టీడీపీకి చెందిన పలువురు సిట్టింగ్‌లు, ముఖ్యనేతలు, కీలకనేతలు ఆ పార్టీకి టాటా చెప్పేసి బీజేపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే.

రేవంత్ నాకు ముద్దుల అన్నయ్య.. జనసేనకు సింగిల్ సర్పంచ్ లేరే!?

రేవంత్.. రేవంత్.. రేవంత్.. గత కొన్ని రోజులుగా ఈ ఫైర్‌బ్రాండ్ పేరు తెలంగాణ రాజకీయాల్లో గట్టిగానే వినపడుతోంది.