close
Choose your channels

సుశాంత్‌ని చంపినట్టు చంపేస్తారు: కంగన

Friday, March 5, 2021 • తెలుగు Comments

సుశాంత్‌ని చంపినట్టు చంపేస్తారు: కంగన

బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ ఎంత ధైర్యంగా బోల్డ్‌గా తన అభిప్రాయాలను వెల్లడిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవలే ట్విటర్ సీఈవోని కడిగి పారేసిన ఈ ముద్దుగుమ్మ.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ మీదకు దండెత్తింది. తన మాజీ ప్రియుడి విషయంలో అమ్మడు మంటలు మండించింది. తన పరువును మంటగలపాలని కొందరు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని.. అటువంటి వారిని వదిలేదే లేదని స్పష్టం చేసింది. కొందరు పెయిడ్ కాంపైన్‌కి బానిసలై తనపై ఆరోపణలు గుప్పిస్తున్నారని వారెవరో తనకు తెలుసని మండిపడింది.

బాలీవుడ్ ప్రముఖ నటుడు సుశాంత్ మరణం గురించి కంగన మాట్లాడుతూ... గత వారం తాను ఇన్‌స్టాలో 5 లక్షలకు పైగా ఫాలోయర్స్‌ను కోల్పోయానని.. ఇదొక మాఫియా రాకెట్ అని తెలిపింది. వారంతా ఒక గ్యాంగ్‌లా తయారై.. నిన్ను టార్గెట్ చేసి సోషల్ మీడియాలో బాయ్‌కాట్ చేస్తారు. నీ సంతోషాన్ని నాశనం చేస్తారు. నీ ఇమేజ్‌ని, బ్రాండ్‌ని కోల్పోతావు. ఫైనల్‌గా అన్నీ కోల్పోయి సుశాంత్‌ని చంపినట్టు చంపేస్తారు. ఎవరితోనైనా సరే వాళ్లకు పనిలేదంటే వాళ్లు బయటి వాళ్లైనా సరే హింసిస్తారు.

అసభ్యకరమైన మీమ్స్‌తో తన గురించి సోషల్ మీడియాలో బ్యాడ్‌గా ప్రచారం చేస్తున్నారని వాపోయింది. తన టీం మెంబర్స్ అన్ని విషయాలను ఆరా తీస్తోందని.. రేపో మాపో విషయాలన్నీ వెల్లడవుతాయని పేర్కొంది. తనపై వస్తున్న మీమ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆ ఫేక్‌ కంపెనీలు ఎక్కడివి, ఎవరివి? మొత్తం వివరాలు, ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయనే విషయాలన్నీ తన టీం బయటకు తెస్తుందని వెల్లడించింది. అయితే తన గురించి చెడుగా ప్రచారం చేస్తున్నదెవరో తనకు తెలుసని.. కాకపోతే సమయం వచ్చినప్పుడు అతని పేరు చెబుతానని వెల్లడించింది. అయితే కంగన మరో ట్వీట్ చేసింది.

Get Breaking News Alerts From IndiaGlitz