నెలల వ్యవధిలో కన్నడ స్టార్ హీరో ఇంట్లో మరో విషాదం

  • IndiaGlitz, [Friday,November 19 2021]

ప్రముఖ కన్నడ నటుడు దునియా విజయ్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి రుద్రప్ప (81) కన్నుమూశారు. వయసు సంబంధిత అనారోగ్య సమస్యలతో బెంగళూరులోని ప్రైవేట్‌ ఆసుపత్రిలో రుద్రప్ప మూడు రోజుల క్రితం చేరారు. ఈ నేపథ్యంలో అక్కడ చికిత్స పొందుతూ ఆయన నిన్న కన్నుమూశారు.

శుక్రవారం వారి స్వగ్రామం అనేకల్‌ తాలుకా కుంబారహళ్లి గ్రామంలో రుద్రప్ప అంత్యక్రియలు ముగిశాయి. కాగా విజయ్‌ తల్లి నారాయణమ్మ కూడా ఈ ఏడాది జులైలో అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. నెలల వ్యవధిలోనే తండ్రి కూడా మరణించడంతో విజయ్‌ తీవ్ర విషాదంలో కూరుకుపోయారు. కన్నడలో విలన్, రౌడీ క్యారెక్టర్స్‌తో మంచి పేరు తెచ్చుకున్న విజయ్ .. 'దునియా' సినిమాతో హీరోగా మారాడు. అప్పటి నుంచి ఆ సినిమా పేరు ఆయన ఇంటి పేరుగా మారిపోయింది.

కాగా.. కొన్నేళ్ల క్రితం మొదటిభార్య నాగరత్న నుంచి విడాకులు తీసుకోవాలని విజయ్‌ సిద్ధమవడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. నాగరత్న, ఆమె పిల్లలు– దునియా విజయ్, అతని రెండవ భార్య కీర్తిల మధ్య తరచూ గొడవలు జరుగుతుండడం.. విషయం పోలీసు స్టేషన్ వరకు వెళ్లడంతో విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నాడని అప్పట్లో ప్రచారం జరిగింది.

More News

మన్మథుడి పక్కన ఛాన్స్.. ఎగిరిగంతులు వేయాల్సిందిపోయి, ఈ డిమాండ్లు ఏంటీ..?

కింగ్ అక్కినేని నాగార్జున సినిమాల విషయంలో స్పీడ్ పెంచారు. ఇప్పటికే బంగార్రాజును శరవేగంగా పూర్తి చేస్తున్న ఆయన ..

అద్భుతం... నిజంగా అద్భుతం !!

అద్భుతం... డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్రేక్షకులను నవంబర్ 19న థ్రిల్ చేయబోతున్న ఒక కంప్లీట్ డిజిటల్ ట్రీట్. నేడు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదల కాబోతున్న

ఎక్కువ ట్విస్ట్‌లు, టర్నింగ్‌లు ఉన్న ఎంగేజింగ్‌ కథ ‘అద్భుతం’ : యంగ్‌ హీరో తేజ సజ్జా

‘ఓ బేబి’, ‘జాంబిరెడ్డి’ వంటి విజయవంతమైన చిత్రాల ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన యంగ్‌ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో,

‘బంగార్రాజు’ నుంచి హీరోయిన్ కృతి శెట్టి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

సోగ్గాడే చిన్నినాయన చిత్రంతో నాగార్జున, కళ్యాణ్ కృష్ణ మ్యాజిక్ చేశారు. ఆ చిత్రానికి ప్రీక్వెల్‌గా ఇప్పుడు బంగార్రాజు చిత్రం రాబోతోంది.

బిగ్‌బాస్ 5 తెలుగు: స్విమ్మింగ్‌పూల్‌లో దిగనన్న సిరి.. తనకు తాను షూట్ చేసుకున్న సన్నీ

బిగ్‌బాస్ 5 తెలుగు పదకొండో వారంలో తొలి రెండు రోజులు ఎమోషనల్‌గా, పెద్దగా గొడవలు లేకుండా సాగిన ఎపిసోడ్లు ఈరోజు మళ్లీ రచ్చ లేపాయి.