మాలాశ్రీ భర్త, ప్రముఖ నిర్మాత కొణిగల్ రాము కరోనాతో మృతి

  • IndiaGlitz, [Tuesday,April 27 2021]

కన్నడ సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. సీనియర్‌ నటి మాలా శ్రీ భర్త, నిర్మాత కొణిగల్ రాము(52) కరోనాతో కన్నుమూశారు. గత వారం ఆయనకు కరోనా సోకగా వెంటనే చికిత్స నిమిత్తం బెంగుళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. సోమవారం ఆయన పరిస్థితి విషమించడంతో సాయంత్రం ఆయన మరణించారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించి కొణిగల్‌ రాము కన్నడ సినీ ఇండస్ర్టీలో ప్రొడ్యూసర్‌గా మంచి స్థానం ఏర్పరుచుకున్నారు.

అప్పట్లో స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటి మాలాశ్రీని కొణిగల్ రాము వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొణిగల్‌ రాము ఎక్కువగా భారీ బడ్జెట్ సినిమాలను తెరకెక్కించారు. కోట్లాది రూపాయలతో సినిమాలను తెరకెక్కిస్తారు కాబట్టే ఆయనను కన్నడ నాట ‘కోటి రాము’ అని పిలుస్తారు. దాదాపు ఆయన 39 సినిమాలకు ఇండస్ట్రీకి అందించారు. శాండల్‌ వుడ్‌లో ఏకే 47, లాకప్‌ డెత్‌, సీబీఐ దుర్గ వంటి ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాలను నిర్మించిన ఘనత రాముదే. కొణిగల్‌ రాము మృతిపై కన్నడ సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి లోనైంది. కొణిగల్ రాముకు పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

More News

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత ఎంఎస్ఆర్ మృతి

మాజీ పీసీసీ అధ్యక్షులు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి ఎం.సత్యనారాయణ రావు (88) ఇక లేరు.

ఎన్నికల అధికారులపై హత్య కేసు నమోదు చేయాలి: మద్రాసు హైకోర్టు

పలు రాష్ట్రాల్లో కరోనా ఒక్కసారిగా తీవ్ర స్థాయిలో విజృంభించడానికి ఎన్నికలు కూడా కారణమయ్యాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నా పేరుతో నకిలీ ఆడియోను వైరల్ చేస్తున్నారు: మాజీ జేడీ లక్ష్మీనారాయణ

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పేరుతో ఓ ఆడియో వైరల్ అవుతోంది. సదరు ఆడియోలో లాక్‌డౌన్ రెండు నెలల పాటు ఉండబోతోందని..

'పంచతంత్రం'లో రామనాథం ఫస్ట్‌లుక్ విడుదల

‘పద్మశ్రీ’ బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, యువ హీరో రాహుల్‌ విజయ్‌, ‘మత్తు వదలరా’ ఫేమ్‌ నరేష్‌ అగస్త్య ప్రధాన తారాగణంగా నటిస్తున్న చిత్రం 'పంచతంత్రం'.

కరోనాతో సినీ దర్శకుడు సాయి బాలాజీ ప్రసాద్ మృతి

కరోనా సెకండ్ వేవ్ తీవ్ర స్థాయిలో వ్యాప్తి చెందుతోంది. ఈ మహమ్మారి బారిన పడి ఎంతో మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు.