close
Choose your channels

క‌న్న‌డ హీరోయిన్‌తో బాల‌కృష్ణ‌

Monday, November 11, 2019 • తెలుగు Comments

క‌న్న‌డ హీరోయిన్‌తో బాల‌కృష్ణ‌

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ ఒక ప‌క్క రూల‌ర్ సినిమాను పూర్తి చేస్తున్నాడు. మ‌రో ప‌క్క బోయ‌పాటితో సినిమాకు రెడీ అవుతున్నాడు. త్వ‌ర‌లోనే బాల‌కృష్ణ‌, బోయ‌పాటి సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ఈ సినిమాలో క‌న్న‌డ హీరోయిన్‌ను ర‌చితా రామ్‌ను బాల‌య్య స‌ర‌స‌న న‌టింప చేయాల‌నుకుంటున్నార‌ట‌. ఆ హీరోయిన్‌తో ప్ర‌స్తుతం ద‌ర్శ‌క నిర్మాత‌లు చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ని టాక్‌. త్వ‌ర‌లోనే బాల‌య్య 106వ చిత్రంలో హీరోయిన్‌గా ఎవ‌రు న‌టిస్తారు? అనే దానిపై ఓ క్లారిటీ రానుంది. అలాగే ఈ చిత్రంలో విల‌న్‌గా బాలీవుడ్ స్టార్ న‌టుడు సంజ‌య్‌ద‌త్‌ను సంప్ర‌దిస్తున్నార‌ని స‌మాచారం. ఆయ‌న కూడా దాదాపు సుముఖంగానే ఉన్నాడ‌ని డేట్స్ అడ్జ‌స్ట్ విష‌యానికి సంబంధించిన చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ట‌.

మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి నిర్మాణంలో బోయ‌పాటి భారీ రేంజ్‌లో ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నాడ‌ట‌. బోయ‌పాటి సినిమా అంటే మాస్ క‌మ‌ర్షియ‌ల్‌గా ఉంటూనే భారీ హంగులుంటాయి. త‌న గ‌త చిత్రాల‌కు ఏ మాత్రం త‌గ్గ‌కుండా బాల‌య్య 106 చిత్రాన్ని తెర‌కెక్కించాల‌నుకుంటున్నాడ‌ట బోయ‌పాటి. సింహా, లెజెండ్ వంటి సూప‌ర్ డూప‌ర్‌హిట్ చిత్రాల త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న సినిమా కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. బాల‌కృష్ణ‌ను ఈసారి బోయ‌పాటి ఎలాంటి ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో చూపిస్తాడో అనే ఆస‌క్తి అంద‌రిలోనూ నెల‌కొంది.

Get Breaking News Alerts From IndiaGlitz