వెంక‌టేశ్ స‌ర‌స‌న కన్న‌డ భామ‌

  • IndiaGlitz, [Thursday,January 02 2020]

త‌మిళంలో ధ‌నుష్ హీరోగా న‌టించిన చిత్రం 'అసుర‌న్‌'. వెట్రిమార‌న్ తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని తెలుగులో వెంక‌టేశ్ హీరోగా రీమేక్ చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. 'సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లెచెట్లు' ఫేమ్ శ్రీకాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెర‌కెక్క‌నుంది. త్వ‌ర‌లోనే సెట్స్‌కు వెళ్ల‌బోయే ఈ సినిమా కోసం వెంక‌టేశ్ త‌న లుక్‌ను మార్చుకుంటున్నాడు. ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు తుది ద‌శ‌కు చేరుకున్నాయి. వెంక‌టేశ్ స‌ర‌స‌న శ్రియా శ‌ర‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుంద‌ని వార్త‌లు వినిపించాయి. అయితే లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ఇప్పుడు క‌న్నడ భామ ప్రియ‌మ‌ణి హీరోయిన్‌గా న‌టించ‌నుంద‌ని టాక్‌. వెంక‌టేశ్‌, ప్రియ‌మ‌ణి కాంబినేష‌న్‌లో రానున్న తొలి సినిమా ఇదే కానుంది.

గ‌త ఏడాది ఎఫ్ 2, వెంకీమామ చిత్రాల‌తో రెండు స‌క్సెస్‌ల‌ను త‌న ఖాతాలో వేసుకున్న విక్ట‌రీ వెంక‌టేశ్‌.. కొత్త ఏడాది స‌క్సెస్‌ఫుల్ సినిమా రీమేక్‌తోస్టార్ట్ చేయ‌బోతున్నాడు. భూ వివాదాల నేప‌థ్యంలో సినిమా తెర‌కెక్క‌నుంది. తెలుగులో ఈ చిత్రాన్ని డి.సురేష్‌బాబు, క‌లైపులి థాను నిర్మించనున్నారు. త్వ‌ర‌లోనే సినిమాకు సంబంధించిన అధికారిక స‌మాచారం వెలువ‌డ‌నుంది.

More News

2019 సినిమా రౌండప్.. ప్రధాన ఘట్టాలివీ..

2019కు గుడ్ బై చెప్పేసి మరికొన్ని గంటల్లోనే కోటి ఆశలతో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం.

'సినిమా కథా చిత్రమ్' ఆడియో లాంచ్

`వంశం` చిత్రానికి 13 అవార్డ్స్ సొంతం చేసుకున్న దర్శకుడు   రామ్ మధుసూదన్ దర్శకత్వం లో వస్తోన్న తాజా చిత్రం `సినిమా కథా చిత్రమ్ రామ్ ఫిలిమ్స్ పతాకం పై

'హాల్ చల్' ప్రీ రిలీజ్ ఈవెంట్, జవవరి 3న విడుదల

ఎమ్.ఎస్.కె డిజిటల్ బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ సమర్పించు, శ్రీ రాఘవేంద్ర ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై

షూటింగ్ మొద‌లెట్టేసిన చిరంజీవి

రీ ఎంట్రీ త‌ర్వాత ఖైదీ నంబ‌ర్ 150, సైరా న‌ర‌సింహారెడ్డి చిత్రాల త‌ర్వాత మెగాస్టార్ చిరంజీవి కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో

కొత్త వ్యాపారంలోకి క్రేజీ స్టార్

పెళ్ళిచూపులు, అర్జున్ రెడ్డి చిత్రాలతో యూత్‌లో విపరీతమైన క్రేజ్‌ను సొంతం చేసుకున్న యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ.