ఎన్టీఆర్ చిత్రంలో విలన్ కన్నడ స్టార్

  • IndiaGlitz, [Thursday,April 06 2017]

జ‌న‌తా గ్యారేజ్ సూప‌ర్‌స‌క్సెస్ త‌ర్వాత యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా ఎన్టీఆర్ట్స్ బ్యాన‌ర్‌పై క‌ళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న చిత్రం 'జై ల‌వ‌కుశ‌'. ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభిన‌యం చేస్తాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఒక పాత్ర‌లో ఎన్టీఆర్ నెగ‌టివ్ షేడ్‌తో పాటు న‌త్తి కూడా ఉన్నట్లు న‌టిస్తాడ‌ట‌. రాశిఖ‌న్నా, నివేదాథామ‌స్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి బాబీ ద‌ర్శ‌కుడు.

ప్ర‌స్తుతం సినిమా శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. ఈ సినిమాలో విల‌న్‌గా క‌న్న‌డ వివాద‌స్ప‌ద న‌టుడు దునియా విజ‌య్ నటించ‌బోతున్నాడ‌ని టాక్ విన‌ప‌డుతుంది. విల‌న్‌గా ఎవ‌రు న‌టిస్తార‌నే దానిపై త్వ‌ర‌లోనే క్లారిటీ రానుంది. స‌మంత ఈ చిత్రంలో అతిథిపాత్ర‌లో క‌న‌ప‌డ‌నుంద‌ని కూడా ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల స‌మాచారం.

More News

డార్జిలింగ్ కు రాజా..రవితేజ

మాస్ మహారాజా రవితేజ ఇప్పుడు ఏకంగా రెండు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో నల్లమలుపుబుజ్జి, ఠాగూర్ మధు నిర్మిస్తున్న టచ్ చేసి చూడు ఒక చిత్రం కాగా, మరో చిత్రంగా దిల్రాజు నిర్మాతగా అనిరావి పూడి దర్శకత్వంలో రూపొందుతోన్న రాజా ది గ్రేట్.

రాజశేఖర్ 'పి.ఎస్.వి.గరుడవేగ' లో సన్నిలియోన్

అంకుశం,అగ్రహం,మగాడు వంటి పవర్ ఫుల్ పోలీస్ చిత్రాల్లో యాంగ్రీ యంగ్ మేన్ గా వెండితెర పై ప్రేక్షకులను ఉర్రూతలు ఊగించిన డా.రాజశేఖర్

ఇక్కడ సెన్సార్ చేయని సినిమాకి..అక్కడ ఒక్క కట్ లేకుండా సెన్సార్ అయ్యింది

నవకళ వారి శ్రీ శ్రీమాన్ ప్రొడక్షన్స్ బ్యానర్పై శశాంక మౌళి, మమతా రాహుత్, పావని హీరో హీరోయిన్లుగా శ్రీను విజ్జగిరి, ప్రసాద్కుమార్ నిర్మాతలుగా రత్న దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'కత్రినా కరీనా మధ్యలో కమల్హాసన్'.

అందరి మనసుల్లో 'మనసైనోడు'

నూతనం..నిత్య నూతనం ..ఈ సినీ పరిశ్రమలోకి ఏoతో మంది నూతనంగా ప్రవేశించి...

మరోసారి బాలయ్యతో....

నందమూరి బాలకృష్ణ 100వ చిత్రంలో వశిష్టిదేవిగా నటించిన శ్రేయాశరన్ ఇప్పుడు బాలకృష్ణ 101వ చిత్రంలో కూడా నటిస్తుందని ఫిలింనగర్ వార్తలు వస్తున్నాయి.