close
Choose your channels

SVRangarao: ఎస్వీ రంగారావుపై వ్యాఖ్యలు : భగ్గుమన్న కాపునాడు, క్షమాపణలు చెప్పకుంటే .. బాలయ్యకు అల్టీమేటం

Wednesday, January 25, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సినీనటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై కాపు నాడు ఆగ్రహం వ్యక్తం చేసింది. దివంగత మహానటుడు ఎస్వీ రంగారావును ఉద్దేశిస్తూ బాలయ్య చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. ఇందుకు ఈ నెల 25 వరకు డెడ్ లైన్ విధించింది. ఈ మేరకు మంగళవారం కాపునాడు ప్రకటన విడుదల చేసింది. రాజకీయాల్లో రాణించాలంటే అంత సులువు కాదని, చిరంజీవి సైతం విఫలమయ్యారని బాలయ్య సెటైర్లు వేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజకీయాల్లో విజయం తమకే సాధ్యమని.. మా బ్లడ్డు, బ్రీడు వేరని అన్న మాటలు కాపుల మనోభావాల్ని దెబ్బతీశాయని కాపునాడు పెద్దలు ఫైర్ అయ్యారు.

ఆ మాటలు కాపుల గుండెల్లో గునపాలు దించాయి:

జనసేనలో తిరిగే వారంతా.. అలగాజనమని, సంకరజాతి అంటూ చేసిన వ్యాఖ్యలు కాపుల గుండెల్లో గునపాలు దింపాయని ఆవేదన వ్యక్తం చేసింది. క్షమాపణలు చెప్పని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా వున్న రంగా విగ్రహాల వద్ద కాపు సోదరులంతా నిరసనకు దిగుతారని కాపునాడు హెచ్చరించింది. గతంలో దేవ బ్రాహ్మణుల విషయంలో అన్న మాటలకు విచారం వ్యక్తం చేస్తూ లేఖను విడుదల చేసినట్లుగా .. ఎస్వీఆర్‌పై చేసిన వ్యాఖ్యలకు గాను మీడియా ముఖంగా క్షమాపణలు చెప్పాలని కాపునాడు డిమాండ్ చేసింది. అలాగే టీడీపీ నుంచి బాలయ్యను పదేళ్ల పాటు బహిష్కరించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్‌కు స్పందించిన పక్షంలో త్వరలో జరగనున్న నారా లోకేష్ పాదయాత్రను అడ్డుకుంటామని వారు హెచ్చరించారు.

వేదికలపై నోరు జారుతోన్న బాలయ్య :

కాగా..ఇటీవల బహిరంగ వేదికలపై బాలయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం దేవ బ్రహ్మాణులపై బాలకృష్ణ ఇటీవల చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై వివాదం రేగడంతో బాలయ్య స్పందించారు. ఆ మాటలు దురదృష్టవశాత్తూ అన్నానని.. తన పొరపాటును మన్నిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. అసలేం జరిగిందంటే.. దేవ బ్రాహ్మణులు (దేవాంగులు)కు నాయకుడు రావణ బ్రహ్మా అని ఓ కార్యక్రమంలో బాలయ్య వ్యాఖ్యానించారు. అయితే దీనిపై దేవాంగులు భగ్గుమన్నారు. దేవ బ్రహ్మాణులకు దేవల మహర్షి గురువని అన్నారు. బాలకృష్ణ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని.. దేవాంగ కులానికి క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీంతో బాలయ్య స్పందించారు. దీనిపై ఓ ప్రకటన విడుదల చేశారు. తన పొరపాటును మన్నించాలని.. సాటి సోదరుల మనసు గాయపరచటం వల్ల తనకు కలిగే ప్రయోజనం ఏముంటుందన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.