రానా సినిమాను విడుద‌ల చేస్తున్న క‌ర‌ణ్‌ జోహార్

  • IndiaGlitz, [Tuesday,September 20 2016]

'బాహుబ‌లి ది బిగినింగ్' సినిమాను ద‌ర్మేంద్ర ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై బాలీవుడ్‌లో విడుద‌ల చేసి తెలుగు సినిమా మార్కెట్‌కు హిందీలో మార్గం వేసుకునేలా దోహ‌ద‌ప‌డిన నిర్మాత క‌ర‌ణ్ జోహార్ ఇప్పుడు రానా ద‌గ్గుబాటి హీరోగా పివిపి బ్యాన‌ర్‌పై సంక‌ల్ప్ రెడ్డి తెర‌కెక్కిస్తున్న చిత్రం 'ఘాజి'. 1971లో ఇండియా, పాకిస్థాన్ యుద్ధంలో ఇండియ‌న్ నేవీలో కీల‌క‌పాత్ర పోషించిన ఈ యుద్ధ‌నౌక స‌ముద్రంలోనే మునిగిపోయింది.

దాన్ని ఆధారంగా చేసుకుని భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రంలో విజువ‌ల్ ఎఫెక్ట్స్ ప్రేక్ష‌కుల‌ను థ్రిల్ చేసేలా రూపొందిస్తున్నార‌ట‌. ఈ చిత్రాన్ని హిందీలో క‌ర‌ణ్ జోహార్ ఫ్యాన్సీ ఆఫ‌ర్‌తో ద‌క్కించుకోవ‌డం విశేషం. అల్రెడి రానాకు హిందీలో మంచి గుర్తింపు ఉంది, అలాగే తాప్సీ హీరోయిన్‌గా, కె.కె.మీన‌న్ కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తుండ‌టం వంటివి హిందీలో కూడా వ‌ర్క‌వుట్ అవుతాయ‌ని క‌ర‌ణ్ జోహార్ బ‌లంగా న‌మ్ముతున్నాడ‌ట‌.

More News

శ్రీకాళ‌హ‌స్తిలో అనిత ప్ర‌త్యేక పూజ‌లు

నువ్వు నేను ఫేమ్ అనిత చాలా గ్యాప్ త‌రువాత తెలుగులో మ‌న‌లో ఒక‌డు అనే చిత్రంలో న‌టించింది. ఆర్.పి.ప‌ట్నాయ‌క్ ద‌ర్శ‌కత్వంలో రూపొందిన మ‌న‌లో ఒక‌డు త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

యు.ఎస్ లో హాఫ్ మిలియ‌న్ మార్క్ క్రాస్ చేసిన జ్యోఅచ్యుతానంద‌..!

నారా రోహిత్, నాగ శౌర్య‌, రెజీనా కాంబినేష‌న్లో అవ‌స‌రాల శ్రీనివాస్ తెర‌కెక్కించిన చిత్రం జ్యోఅచ్యుతానంద‌. ఈ చిత్రాన్ని వారాహి చ‌ల‌న చిత్ర బ్యాన‌ర్ పై సాయి కొర్ర‌పాటి నిర్మించారు.

కొత్త ద‌ర్శ‌కుడితో నాగ‌శౌర్య‌

రీసెంట్‌గా జ్యో అచ్యుతానంద మంచి విజ‌యాన్ని అందుకున్న హీరో నాగ‌శౌర్య నెక్ట్స్ సినిమా ఏం చేస్తాడ‌నే దానిపై ఇప్ప‌టికీ ఒక క్లారిటీ వ‌చ్చింది. నిజానికి నాన్న‌కు ప్రేమ‌తో క‌థా ర‌చ‌యిత హుస్సేన్ షా కిర‌ణ్‌, నందినీ రెడ్డిల ద‌ర్శ‌క‌త్వంలో సినిమాలు చేయ‌నున్నాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి.

రోబో 2.0 లేటెస్ట్ అప్ డేట్..!

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ - గ్రేట్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతున్న చిత్రం రోబో 2.0. ఈ చిత్రం షూటింగ్ కు గ్యాప్ ఇచ్చిన టీమ్ ఇప్పుడు తాజా షెడ్యూల్ కి రెడీ అవుతుంది.

కింగ్ అక్కినేని నాగార్జున చేతుల మీదుగా 'నరుడా..!డోనరుడా...!' ఫస్ట్ లుక్ విడుదల

హీరో సుమంత్ కథానాయకుడుగా రూపొందుతోన్న కొత్త చిత్రం నరుడా..!డోనరుడా..!ఫస్ట్ లుక్ ను అక్కినేని నాగార్జున విడుదల చేశారు.