క‌ర‌ణం మ‌ల్లీశ్వ‌రి బ‌యోపిక్‌

  • IndiaGlitz, [Monday,June 01 2020]

ఇండియ‌న్ సినిమాల్లో బ‌యోపిక్స్ ట్రెండ్ కొన‌సాగుతోంది. రాజ‌కీయ‌, సినీ, క్రీడ‌లు స‌హా ప‌లు రంగాల్లో అత్యున్న‌త సేవ‌లు అందించిన ప‌లువురి జీవిత చ‌రిత్ర‌లు వెండితెర‌పై ఆవిష్కత‌మ‌వుతున్నాయి.

మ‌రికొన్ని చ‌ర్చ‌ల ద‌శ‌లో ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో 2000లో జ‌రిగిన ఒలింపిక్స్ వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో కాంస్య ప‌త‌కం సాధించ‌డ‌మే కాకుండా ఒలింపిక్స్‌లో ప‌తకం సాధించిన తొలి భార‌తీయ మ‌హిళగా రికార్డ్ క్రియేట్ చేసిన క‌ర‌ణం మ‌ల్లీశ్వ‌రి జీవితాన్ని సినిమా రూపంలో ఆవిష్క‌రించ‌నున్నారు. ఎంతో మంది మ‌హిళ‌ల‌కు స్ఫూర్తినిచ్చిన క‌ర‌ణం మ‌ల్లీశ్వ‌రి బ‌యోపిక్‌ను పాన్ ఇండియా మూవీగా రూపొందించ‌నున్నారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు ఎం.వి.వి.సినిమా, కె.ఎఫ్‌.సి బ్యాన‌ర్స్‌పై సంజ‌నా రెడ్డి ఈ బయోపిక్‌ను తెర‌కెక్కించ‌నున్నారు. ఎం.వి.వి.స‌త్య‌నారాయ‌ణ‌, కోన‌వెంక‌ట్ నిర్మాత‌లు.

నేడు(జూన్ 1న) క‌ర‌ణం మ‌ల్లీశ్వ‌రి పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత‌లు అధికారికంగా ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశారు. మ‌రి క‌ర‌ణం మ‌ల్లీశ్వ‌రి పాత్ర‌లో ఎవ‌రు న‌టిస్తార‌నే ది ఆస‌క్తికరంగా మారింది. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ న‌టిస్తుందా?  లేక టాలీవుడ్ హీరోయిన్ న‌టిస్తుందా? అని తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే. త్వ‌ర‌లోనే ఈ చిత్రంలో న‌టించ‌బోయే న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను ప్ర‌క‌టించనున్నారు.

More News

నాగబాబు.. నువ్వెంత.. నీ బతుకెంత : డైరెక్టర్

టాలీవుడ్‌ సీనియర్ హీరో నందమూరి బాలయ్యపై మెగాబ్రదర్ నాగబాబు చేసిన సంచలన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే పలువురు పెద్దలు ఈ వ్యవహారంపై సోషల్ మీడియా వేదికగా..

తెలంగాణలో ఊహించని రీతిలో కరోనా కేసులు నమోదు

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఉధృతి తెలంగాణలో ఇప్పట్లో తగ్గేలా లేదు. రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయే తప్ప అస్సలు తగ్గట్లేదు.

మహేశ్-పూరీ కాంబోలో సినిమా కష్టమేనా!?

సూపర్ స్టార్ మహేశ్ బాబు, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇందుకు ‘పోకిరి’, ‘బిజినెస్‌మెన్’ లాంటి సినిమాలే నిదర్శనం.

‘బుట్ట‌బొమ్మ‌..’  మ‌రో రికార్డ్‌

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన హ్యాట్రిక్ చిత్రం ‘అల వైకుంఠ‌పుర‌ములో’. ఈ సినిమా వ‌సూళ్ల ప‌రంగా నాన్ బాహుబ‌లి రికార్డుల‌ను సాధించింది.

లాక్ డౌన్ 5.0 : దశల వారీగా వీటికి మాత్రమే అనుమతి

కరోనా వ్యాప్తి నియంత్రణలోకి రాకపోవడంతో మరోసారి లాక్ డౌన్‌ (5.0)ను పొడిగించిన విషయం తెలిసిందే. కంటైన్మెంట్ జోన్లను పరిగణనలోకి తీసుకుని దేశంల లాక్ డౌన్‌ను జూన్ 30 వరకు పొడిగించిన కేంద్రం,