'90 ఎం.ఎల్‌' చిత్రంలో ఆథ‌రైజ్డ్ డ్రింక‌ర్ దేవ‌దాస్‌గా కార్తికేయ‌

  • IndiaGlitz, [Friday,September 20 2019]

'ఆర్ ఎక్స్ 100', 'హిప్పీ', 'గుణ‌369' చిత్రాల‌తో క‌థానాయ‌కునిగా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు కార్తికేయ‌. ఇటీవ‌లే 'గ్యాంగ్ లీడ‌ర్‌'లో ప్ర‌తినాయ‌కునిగా కూడా న‌టించి మంచి మార్కులు సంపాదించుకున్నారు. ప్ర‌స్తుతం కార్తికేయ '90 ఎం.ఎల్‌' చిత్రం చేస్తున్నారు. 'ఆర్ ఎక్స్ 100' వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం తీసిన కార్తికేయ క్రియేటివ్ వ‌ర్క్స్ ప‌తాకంపై అశోక్ రెడ్డి గుమ్మ‌కొండ '90 ఎం.ఎల్‌' సినిమా నిర్మిస్తున్నారు. శేఖ‌ర్ రెడ్డి ఎర్ర ద‌ర్శ‌కునిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. సెప్టెంబ‌ర్ 21 *(శ‌నివారం) కార్తికేయ గుమ్మ‌కొండ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా శ‌నివారం ఉద‌యం 10 గంటల 35 నిమిషాల‌కు '90 ఎం.ఎల్‌' టీజ‌ర్‌ని విడుద‌ల చేయ‌నున్నారు.

ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ రెడ్డి ఎర్ర ఈ సినిమా గురించి చెబుతూ - '' ఇందులో హీరో కార్తికేయ పోషిస్తున్న పాత్ర పేరు 'దేవ‌దాస్‌'. ఎంబీఏ గోల్డ్ మెడ‌లిస్ట్. అంత‌టి విద్యావంతుడు ఆథ‌రైజ్డ్ డ్రింక‌ర్‌గా పాపుల‌ర్ అవుతాడు. అత‌ను ఎందుకు డ్రింక‌ర్ అయ్యాడు? ముఖ్యంగా ఆథ‌రైజ్డ్ డ్రింక‌ర్‌గా ఎందుకు పేరు తెచ్చుకున్నాడు? అలాంటి అంశాలు చాలా ఆస‌క్తిక‌రంగా ఉంటాయి. హిలేరియ‌స్ మాస్ ఎంట‌ర్‌టైన‌ర్ ఇది. ఫ్యామిలీ ఆడియ‌న్స్ అంతా కూర్చుని ఎంజాయ్ చేసే విధంగా సినిమా ఉంటుంది'' అన్నారు.

నిర్మాత అశోక్ రెడ్డి గుమ్మ‌కొండ మాట్లాడుతూ '' మా హీరో కార్తికేయ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా టీజ‌ర్ విడుద‌ల చేస్తున్నాం. టీజ‌ర్‌ని బ‌ట్టే సినిమా ఎలా ఉంటుందో అర్థ‌మైపోతుంది. కామ‌న్ మేన్‌కి కూడా క‌నెక్ట్ అయ్యే విధంగా ఈ సినిమా కాన్సెప్ట్ ఉంటుంది. ఇటీవ‌లే హైద‌రాబాద్‌లోని అన్న‌పూర్ణ ఏడెక‌రాల స్టూడియోలో వేసిన సెట్‌లో భారీ ఎత్తున క్లైమాక్స్ చిత్రీక‌రించాం. అక్టోబ‌ర్ 7వ తేదీకి మొత్తం టాకీ పార్ట్ చిత్రీక‌ర‌ణ పూర్త‌వుతుంది. మూడు పాట‌ల‌ను యూర‌ప్‌లోని అంద‌మైన ప్ర‌దేశాల్లో చిత్రీక‌రిస్తాం'' అని తెలిపారు.

More News

సచివాలయ ప్రశ్నాపత్రాల లీకేజీపై చంద్రబాబు స్పందన

ఏపీలో గ్రామ సచివాలయ ఉద్యోగాలకై నోటిఫికేషన్ విడుదల చేసిన నాటి నుంచి ఇప్పటి వరకూ వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి.

టీడీపీకి మరో ఎదురెబ్బ.. మాజీ ఎంపీ కన్నుమూత

టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ శివప్రసాద్ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

ఐదు భాష‌ల్లో 'సంహారిణి' టీజ‌ర్ రిలీజ్

న‌టించిన తొలి సినిమాతోనే  విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న మేటి క‌థానాయిక‌ కుట్టి ప‌ద్మిని. ప్ర‌తిభ‌కు నిలువెత్తు ద‌ర్ప‌ణం.

కార్పొరేట్‌ వర్గాలకు కేంద్రం భారీ ఊరట.. స్టాక్ మార్కెట్‌కు రెక్కలు!

ఆర్ధిక వ్యవస్థకు ఊతం ఇచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం మరికొన్ని చర్యలు చేపట్టింది.

సెన్సేష‌న్ క్రియేట్ చేస్తున్న `సైరా న‌ర‌సింహారెడ్డి` ట్రైల‌ర్‌

మెగాస్టార్ చిరంజీవి టైటిల్‌పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం `సైరా న‌ర‌సింహారెడ్డి`. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌కుడు. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రామ్‌చ‌ర‌ణ్ భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు.