Siddaramaiah:కేటీఆర్‌కు గట్టి కౌంటర్ ఇచ్చిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య

  • IndiaGlitz, [Tuesday,December 19 2023]

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీ హామీలు అమలు చేయడం సాధ్యం కాదని ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య(Siddaramaiah) అసెంబ్లీలో చెప్పినట్లు ఓ వీడియో వైరల్ అవుతోంది. ‘ఎన్నికల్లో ఓట్ల కోసం ఎన్నో హామీలు ఇస్తాం.. అంత మాత్రాన ఫ్రీగా ఇవ్వాలా? మాకు ఇవ్వాలనే ఉంది. అయితే డబ్బులు లేవు’’ అని సిద్దరామయ్య అన్నట్లు ఆ వీడియోలో ఉంది.

ఈ వీడియోను మాజీ మంత్రి, బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యే కేటీఆర్‌(KTR) రీపోస్ట్ చేస్తూ కాంగ్రెస్‌ (Congress)పార్టీపై విమర్శలు గుప్పించారు. ‘‘ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడానికి డబ్బులు లేవని సిద్దరామయ్య అంటున్నారు. అలా హామీల ప్రకటన ఇచ్చే ముందు ఆలోచన చేయరా? తెలంగాణ భవిష్యత్తు కూడా ఇలాగే ఉంటుందా?’’ అని అందులో ప్రశ్నించారు.

కేటీఆర్‌ ట్వీట్‌కు సిద్ధరామయ్య వెంటనే కౌంటర్ ట్వీట్ చేశారు. తెలంగాణ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ ఎందుకు ఓడిపోయిందో తెలుసా అంటూ కేటీఆర్‌ను ప్రశ్నించారు. ఎందుకంటే ఏది ఫేక్‌ వీడియో(Fake Video).. ఏది ఎడిట్‌ చేసిన వీడియో అన్నది నిర్ధారించడం కూడా బీఆర్‌ఎస్‌ పార్టీకి తెలియదని ఎద్దేవా చేశారు. వీడియోను ఎవరో ఎడిట్ చేసి పోస్ట్‌ చేస్తే ఆ వీడియో నిజమని నమ్మి... మీరు వాటిని ప్రచారం చేస్తారని మండిపడ్డారు. అందుకే బీఆర్‌ఎస్‌ పార్టీ బీజేపీ(BJP)కి పర్‌ఫెక్ట్‌ బీటీమ్ అని విమర్శించారు. ఆ వీడియో నిజమైందా... నకిలీదా..? అని తెలుసుకోవాలంటే ఒరిజినల్‌ లింక్ ఓపెన్‌ చేసి చూడండి అంటూ ట్విట్టర్‌లో తెలిపారు.

కాగా తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారెంటీల హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో వీటిని అమలు చేస్తామని తెలిపింది. అన్నట్లుగానే అధికారంలోకి వచ్చిన మూడు రోజుల్లోనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10లక్షలకు పెంపు వంటి హామీలను అమలు చేసింది. అయితే మిగిలిన హామీల పరిస్థితి ఏంటని కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ విమర్శలు చేస్తోంది. ఈ విమర్శలకు కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఎటాక్ ఇస్తున్నారు. గత బీఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్రం అప్పుల పాలైందని.. అయినా కానీ తాము ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తామని స్పష్టం చేస్తున్నారు.

More News

Modi, Sonia Gandhi: టార్గెట్ సౌత్.. తెలంగాణ నుంచి ప్రధాని మోదీ, సోనియా గాంధీ పోటీ..?

మరో మూడు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో మరోమారు అధికారం కాపాడుకోవాలని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ, ఈసారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని కాంగ్రెస్

Hanuman:విజువల్ ట్రీట్‌గా 'హనుమాన్' ట్రైలర్

పాన్ ఇండియా ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సినిమాల్లో 'హనుమాన్'  ఒకటి. ప్రశాంత్ వర్మ(Prasanth Varma) దర్శకత్వంలో

Somireddy:మాజీ మంత్రి సోమిరెడ్డి దీక్ష భగ్నం.. భారీగా తరలివచ్చిన హిజ్రాలు..

నెల్లూరు జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌ ఆపేయాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy Chandramohan Reddy)

China:చైనాలో భారీ భూకంపం.. 100 మందికి పైగా మృతి..

చైనాలో సోమవారం రాత్రి భారీ భూకంపం(China Earthquake) సంభవించింది. వాయువ్య చైనాలోని గన్సు ప్రావిన్స్‌లో

Mallareddy:తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన మల్లారెడ్డి.. విచారణ వాయిదా..

తనపై నమోదైన భూకబ్జా కేసుపై మాజీ మంత్రి మల్లారెడ్డి (Mallareddy)తెలంగాణ హైకోర్టు(Telangana High Court)ను ఆశ్రయించారు.