నిన్న సీఎంకు.. నేడు మాజీ సీఎంకు కరోనా పాజిటివ్..

  • IndiaGlitz, [Tuesday,August 04 2020]

నిన్న కర్ణాటక సీఎం యడియూరప్పకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. నేడు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సిద్ధరామయ్యకు కరోనా సోకింది. కరోనా లక్షణాలు కనిపించడంతో ఆయన సోమవారం పరీక్ష చేయించుకోగా కరోనాగా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. వైద్యుల సలహా మేరకు తాను ఆసుపత్రిలో చేరానని సిద్దరామయ్య వెల్లడించారు. ఇటీవల తనను కలిసిన వారంతా క్వారంటైన్‌కు వెళ్లాలని సిద్ధరామయ్య సూచించారు.

‘నాకు కొవిడ్-19 పాజిటివ్‌గా పరీక్షల్లో నిర్ధారణ అయింది. వైద్యుల సలహాపై నేను ముందుజాగ్రత్త చర్యగా ఆసుపత్రిలో చేరాను. నన్ను కలిసిన వారందరూ, కరోనా లక్షణాలున్న వారు క్వారంటైన్‌కి వెళ్లండి’ అంటూ సిద్ధరామయ్య ట్వీట్ చేశారు. దీనికి ఒక్కరోజు ముందే కర్ణాటక సీఎం యడియూరప్పకు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన బెంగుళూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సీఎం, మాజీ సీఎంలిద్దరికీ కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో వారిని కలిసిన వారు ఆందోళనకు గురవుతున్నారు.

More News

వరుసగా ఆరో రోజు 50 వేలు దాటిన కరోనా కేసులు..

దేశంలో కరోనా మహమ్మరి విజృంభణ కొనసాగుతోంది. ఆరు రోజులుగా కరోనా కేసులు దేశంలో 50 వేలకు ఏమాత్రం తగ్గడం లేదు.

తెలంగాణలో తాజాగా 1286 కరోనా కేసులు..

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. తెలంగాణ కరోనా హెల్త్ బులిటెన్‌ను మంగళవారం వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది.

మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య కరోనాతో మృతి

భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య (59) కరోనాతో మృతి చెందారు. కొద్దిరోజుల నుంచి అనారోగ్యంతో రాజయ్య బాధపడుతున్నారు.

ప్రముఖ వాగ్గేయకారుడు వంగపండు ఇక లేరు..

ప్ర‌ముఖ వాగ్గేయకారుడు వంగ‌పండు ప్ర‌సాద‌రావు(77)  మంగ‌ళ‌వారం క‌న్నుమూశారు.

ఏపీలో ఊరటనిస్తున్న కరోనా.. నేడు ఎన్ని కేసులంటే..

ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టి కాస్త ఊరటనిస్తోంది. వరుసగా మూడు రోజుల పాటు పది వేలకు పైగా నమోదైన కేసులు నిన్న 8 వేలు నమోదవగా..