ఇలాంటి దారుణమైన జీవో కనివినీ ఎరిగి ఉండరు..

  • IndiaGlitz, [Friday,April 23 2021]

నిజమే.. చదువుతుంటేనే ఇంత దారుణమా? అనిపిస్తుంటుంది. కానీ అలాంటి జీవో ప్రభుత్వమే జారీ చేసిందంటే రాష్ట్రంలో పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థమవుతుంది. దేశంలో మూడున్నర లక్షల కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. ఏ ఆసుపత్రి వైపు చూద్దామన్నా భయానక దృశ్యాలే. ఆసుపత్రుల నిండా కరోనా పేషెంట్లు.. మార్చురీ లోపలే కాదు.. బయటా శవాలు.. శ్మశానాల్లో కాల్చేందుకు చోటు లేక బయట శవాలతో క్యూ.. నిజంగా ఇలాంటి పరిస్థితిని ఎప్పుడైనా ఊహించామా? అసలు మన దేశానికి ఇంతటి దౌర్భాగ్యం దాపురిస్తుందని కలలోనైనా అనుకున్నామా?

పరిస్థితి ఇంత దయనీయంగా ఉంటే ప్రభుత్వం మాత్రం ఏం చేస్తుంది. అందుకే కర్ణాటక ప్రభుత్వం ఒక చిత్రమైన జీవోను విడుదల చేసింది. ఆ జీవోను బట్టి రాష్ట్ర పరిస్థితి ఏంటన్నది అవగతమవుతోంది. కర్ణాటకలో శ్మశానాల దగ్గర తాకిడి చాలా ఎక్కువగా ఉంది. జనం తమ బంధువుల శవాలకు దహన సంస్కారాలు నిర్వహించాలంటే క్యూలో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొందట. ఈ పరిస్థితుల్లో ఎవరి బంధువుల శవాన్ని వారు మీ మీ సొంత భూములలో దహన సంస్కారాలు చేసుకోండని కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సొంత భూమి ఉంటే ఓకే కానీ లేని వారి పరిస్థితి ఏంటి? వారు ఏం చేయాలి? అనేది మాత్రం ప్రభుత్వం వెల్లడించలేదు.

కరోనా రోగులకు ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత నుంచి అన్నీ ఇబ్బందులే. వైద్య సిబ్బంది సైతం మెల్లగా కరోనా బారిన పడుతున్నారు. దీంతో రోగుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. వారికి చికిత్సను అందించే దిక్కులేక అల్లాడుతున్నారు. ఒకవేల ఖర్మ కాలి చస్తే శ్మశానానికి తీసుకెళ్లడానికి అంబులెన్స్‌లు లేవ్..ఒక వేళ అంబులెన్స్ దొరికితే శ్మశానంలో కాల్చడానికి ఖాళీలుండవ్.. కనీసం తమ చివరి మజిలీకి తోడుగా శ్మశానం వరకూ వచ్చి గౌరవంగా సాగనంపే ఆ నలుగురు ఉండరు.. కనీసం శవం ఎవరిదో కూడా తెలియని వ్యక్తులు అత్యంత దయనీయంగా ఏ జంతు కళేబరానికో చేసినట్టుగా అంత్యక్రియలు చేస్తారు. ఇలాంటి దిక్కుమాలిన చావు.. ఎవరికీ రావద్దన్నట్టుగా ఉంది పరిస్థితి.

More News

18 ఏళ్ల పైబడినవారికి.. 28 నుంచి రిజిస్ట్రేషన్‌

కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని ప్రభుత్వం భావిస్తోంది.

అరుణ గ్రహంపై ఆక్సిజన్‌ను తయారు చేసిన పెర్సెవరెన్స్ రోవర్

అంగారకుడిపైకి నాసా పంపిన రోవర్ ‘పెర్సెవరెన్స్’ మరో అద్భుతాన్ని సృష్టించింది.

కరోనాను రెండు నిమిషాల్లోనే తెలుసుకోవచ్చు.. చెన్నై విద్యార్థుల ఘనత

కరోనా మహమ్మారి సోకిందనే అనుమానం ఒక ఎత్తైతే.. నిజంగా సోకిందా? లేదా? అని నిర్ధారణ పరీక్ష చేయించుకోవడం ఒక ఎత్తు.

కోవిడ్ ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం.. 13 మంది మృతి

అసలే కరోనా మహమ్మారి కారణంగా ప్రాణాలు ఉంటాయో.. పోతాయో తెలియని స్థితిలో జనం బిక్కుబిక్కుమంటూ కాలం గడిపేస్తున్నారు.

మంత్రి కేటీఆర్‌కు కరోనా పాజిటివ్..

తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. సామాన్యులతో పాటు ప్రముఖులు సైతం పెద్ద సంఖ్యలో కరోనా బారిన పడుతున్నారు.