'ఖాకి'లో కార్తి, రకుల్ కెమిస్ట్రీ

  • IndiaGlitz, [Wednesday,November 15 2017]

ఒక సినిమా హిట్ కావడానికి చాలా అంశాలు దోహదం చేస్తుంటాయి. కొన్ని సార్లు యాక్షన్, మరికొన్ని సార్లు కామెడీ.. ఇలా ఒక్కోసారి ఒక్కొక్క జోనర్ అంశాలు పైచేయిగా నిలుస్తుంటాయి. అయితే ఎవర్గ్రీన్ విషయం, ఎవర్గ్రీన్గా యువ హృదయాలను కదిలించే అంశం రొమాన్స్.

తెరపై రొమాన్స్ జరుగుతున్నంత సేపు, రొమాంటిక్ ఫీలింగ్స్, రొమాంటిక్ సన్నివేశాలు వస్తున్నంత సేపు థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుడు మంత్రముగ్ధుడై పోతాడు. అందుకు హీరో, హీరోయిన్ల కెమిస్ట్రీ చాలా అవసరం అవుతుంది. తాజాగా 'ఖాకి' సినిమాలో 'తొలి వయసే' పాటను, ట్రైలర్ను, మేకింగ్ వీడియోలను చూస్తుంటే అలాంటి ఫీలింగే కలుగుతోంది.

కార్తి, రకుల్ తొలి సారి కలిసి నటిస్తున్న సినిమా ఇది. ఈ సినిమాలో వారిద్దరి మధ్య సన్నివేశాలు, షాట్లు అంతే అన్యోన్యంగా కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా కొన్ని షాట్లు వయోభేదం లేకుండా అందరికీ గిలిగింతలు పెడతాయనయడంలో అనుమానం లేదు.

ఈ నెల 17న విడుదల కానున్న ఈ సినిమాను హెచ్.వినోద్ దర్శకత్వం వహించారు. ఆదిత్య మ్యూజిక్ ప్రైవేట్ లిమిటెడ్ ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా నిర్మించారు. జిబ్రన్ అందించిన సంగీతం సినిమాకు హైలైట్గా నిలిచింది.

More News

ఏపీ ప్ర‌భుత్వం నంది అవార్డుల ప్ర‌క‌ట‌న‌

ఏపీ ప్ర‌భుత్వం 2014 నుండి 2016 వ‌ర‌కు నంది అవార్డుల ప్ర‌క‌టించింది. నంది అవార్డుల‌తో పాటు ఎన్టీఆర్ నేష‌న‌ల్ అవార్డు, ర‌ఘుప‌తి వెంక‌య్య‌, బి.ఎన్‌.రెడ్డి, నాగిరెడ్డి-చ‌క్ర‌పాణి అవార్డుల‌ను కూడా ప్ర‌క‌టించింది. మూడు ఏడాదిల‌కు క‌లిపి ఒకేసారి అవార్డుల‌ను ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం. 

గౌర‌వప్ర‌ద‌మైన అవార్డు రావ‌డం చాలా సంతోషంగా ఉంది: మెగాస్టార్ చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి ఖాతాలో మరో  అవార్డు. తాజాగా ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన అవార్డుల్లో 2016 ఏడాదికిగాను ప్ర‌తిష్టాత్మ‌క ర‌ఘుప‌తి వెంక‌య్య అవార్డు మెగాస్టార్ కు కొద్ది సేప‌టి క్రిత‌మే ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

జోరుగా 'ఖాకి' ప్రమోషన్స్

ఇవాళ్టి రోజుల్లో ప్రచారానికి ఉన్న ప్రాముఖ్యత ఎంత గొప్పదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తను కష్టపడి చేసిన సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో హీరోలు చాలా ముందుంటున్నారు.

సూర్య, కార్తీతో ఒకే ఏడాదిలో..

తెలుగు నాట సక్సెస్ఫుల్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది ఢిల్లీ డాళ్ రకుల్ ప్రీత్ సింగ్. ఇటీవలే ద్విభాషా చిత్రం స్పైడర్ చిత్రంతో పలకరించిన ఈ ముద్దుగుమ్మ.. మరో ద్విభాషా చిత్రం ఖాకితో ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో పల్లెటూరి అమ్మాయి పాత్రలో రకుల్ సందడి చేయనుంది.

గోపీచంద్ కి జోడీగా మెహరీన్ ?

కృష్ణగాడి వీరప్రేమగాథ, మహానుభావుడు, రాజా ది గ్రేట్ .. ఇలా వరుసగా మూడు విజయాలను సొంతం చేసుకుంది పంజాబి ముద్దుగుమ్మ మెహరీన్. ఇటీవల సందీప్ కిషన్కి జోడీగా కేరాఫ్ సూర్యతో సందడి చేసింది.