close
Choose your channels

మ‌రోసారి మెగా టైటిల్‌తో

Tuesday, November 12, 2019 • తెలుగు Comments

మ‌రోసారి మెగా టైటిల్‌తో

త‌మిళంతో పాటు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉన్న హీరోల్లో కార్తి ఒక‌రు. ఆయ‌న హీరోగా న‌టించిన ప్ర‌యోగాత్మ‌క చిత్రం `ఖైదీ` తెలుగు, త‌మిళ భాష‌ల్లో విడుద‌లై ఘ‌న విజ‌యాన్ని సాధించింది. వంద‌కోట్ల రూపాయ‌ల వసూళ్ల‌ను సాధించింది. ఈ సినిమాను అనౌన్స్ చేసినప్పుడు సినిమా ఎలా ఉంటుందోన‌ని తెగ టెన్ష‌న్ ప‌డ్డ వారిలో మెగా ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఎందుకంటే చిరంజీవి స్టార్‌డ‌మ్‌ను తెచ్చి పెట్టిన సినిమా ఖైదీ. ఆ టైటిల్‌తో వ‌చ్చిన కార్తి సినిమా హిట్ కావ‌డంతో వారు ఊపిరి పీల్చుకున్నారు.

తాజాగా ఇప్పుడు మ‌రోసారి కార్తి మెగా ఫ్యామిలీ హీరో టైటిల్‌నే త‌న సినిమాకు వాడుకోవాల‌న‌కుంటున్నాడ‌ని సినీ వ‌ర్గాల స‌మాచారం. వివ‌రాల్లోకెళ్తే దృశ్యం ఫేమ్ జీతూ జోసెఫ్ ద‌ర్శ‌క‌త్వంలో కార్తీ ఓ సినిమా చేశాడు.

ఈ సినిమా ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జర‌పుకుంటుంది. ఈ సినిమాలో కార్తి వ‌దిన‌, హీరోయిన్ జ్యోతిక ఆయ‌న‌కు అక్క పాత్ర‌లో న‌టించ‌డం విశేషం. కాగా.. ఈ సినిమాకు త‌మిళంలో `తంబి` అనే టైటిల్‌ను పెట్టాల‌నుకుంటున్నార‌ట‌. తంబి అంటే త‌మ్ముడు అని అర్థం కాబ్ట‌టి `త‌మ్ముడు` టైటిల్‌నే కార్తి తెలుగు వెర్ష‌న్‌కు పెట్టాల‌నుకుంటున్నార‌ట‌.

చిరు సూప‌ర్‌డూప‌ర్‌హిట్ త‌ర్వాత ప‌వ‌న్ కెరీర్‌లో వ‌న్ ఆఫ్ ది సూప‌ర్ డూప‌ర్ హిట్ మూవీ త్మ‌ముడు టైటిల్‌తో కార్తి మ‌న ముందుకు రానున్నాడు. ఈ సినిమాను డిసెంబ‌ర్‌లో విడుద‌ల చేస్తార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. 

Get Breaking News Alerts From IndiaGlitz