మ‌రోసారి మెగా టైటిల్‌తో

  • IndiaGlitz, [Tuesday,November 12 2019]

త‌మిళంతో పాటు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉన్న హీరోల్లో కార్తి ఒక‌రు. ఆయ‌న హీరోగా న‌టించిన ప్ర‌యోగాత్మ‌క చిత్రం 'ఖైదీ' తెలుగు, త‌మిళ భాష‌ల్లో విడుద‌లై ఘ‌న విజ‌యాన్ని సాధించింది. వంద‌కోట్ల రూపాయ‌ల వసూళ్ల‌ను సాధించింది. ఈ సినిమాను అనౌన్స్ చేసినప్పుడు సినిమా ఎలా ఉంటుందోన‌ని తెగ టెన్ష‌న్ ప‌డ్డ వారిలో మెగా ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఎందుకంటే చిరంజీవి స్టార్‌డ‌మ్‌ను తెచ్చి పెట్టిన సినిమా ఖైదీ. ఆ టైటిల్‌తో వ‌చ్చిన కార్తి సినిమా హిట్ కావ‌డంతో వారు ఊపిరి పీల్చుకున్నారు.

తాజాగా ఇప్పుడు మ‌రోసారి కార్తి మెగా ఫ్యామిలీ హీరో టైటిల్‌నే త‌న సినిమాకు వాడుకోవాల‌న‌కుంటున్నాడ‌ని సినీ వ‌ర్గాల స‌మాచారం. వివ‌రాల్లోకెళ్తే దృశ్యం ఫేమ్ జీతూ జోసెఫ్ ద‌ర్శ‌క‌త్వంలో కార్తీ ఓ సినిమా చేశాడు.

ఈ సినిమా ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జర‌పుకుంటుంది. ఈ సినిమాలో కార్తి వ‌దిన‌, హీరోయిన్ జ్యోతిక ఆయ‌న‌కు అక్క పాత్ర‌లో న‌టించ‌డం విశేషం. కాగా.. ఈ సినిమాకు త‌మిళంలో 'తంబి' అనే టైటిల్‌ను పెట్టాల‌నుకుంటున్నార‌ట‌. తంబి అంటే త‌మ్ముడు అని అర్థం కాబ్ట‌టి 'త‌మ్ముడు' టైటిల్‌నే కార్తి తెలుగు వెర్ష‌న్‌కు పెట్టాల‌నుకుంటున్నార‌ట‌.

చిరు సూప‌ర్‌డూప‌ర్‌హిట్ త‌ర్వాత ప‌వ‌న్ కెరీర్‌లో వ‌న్ ఆఫ్ ది సూప‌ర్ డూప‌ర్ హిట్ మూవీ త్మ‌ముడు టైటిల్‌తో కార్తి మ‌న ముందుకు రానున్నాడు. ఈ సినిమాను డిసెంబ‌ర్‌లో విడుద‌ల చేస్తార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

More News

'జార్జ్ రెడ్డి' ప్రీ రిలీజ్ కు ముఖ్య అతిథిగా పవర్ స్టార్ ?

నిజాం క‌ళాశాల‌, ఉస్మానియా యూనివ‌ర్సిటీల్లో చ‌దువుకునే రోజుల్లో విద్యార్థి నాయ‌కుడిగా ఎంద‌రో విద్యార్థుల‌ను ప్ర‌భావితం చేశారు. కాలేజీ విద్యార్థుల‌కు, రాజ‌కీయాల‌కు ఒక‌ప్పుడు దగ్గ‌ర సంబంధాలుండేవి.

ఇసుక కొరతపై వైఎస్ జగన్ కీలక నిర్ణయం.. కండిషన్స్ అప్లై

ఏపీలో నెలకొన్న ఇసుక కొరతకు శాశ్వత పరిష్కారమార్గం చూపాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు మంగళవారం నాడు ‘స్పందన’ కార్యక్రమంపై

పిచ్చోడు ట్రైలర్ విడుదల చేసిన సుధీర్ బాబు

హేమంత్ ఆర్ట్స్ బ్యానర్ పై హేమంత్ శ్రీనివాస్ నిర్మిస్తోన్న సినిమా పిచ్చోడు. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదలయ్యింది.

జగన్ 'ఇంగ్లిష్' నిర్ణయం సరైనదే..: రాజశేఖర్

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ, మండల, జిల్లా పరిషత్ పాఠశాలల్లోని అన్ని తరగతులను ఇంగ్లిష్ మీడియంలోకి మారుస్తూ వైఎస్ జగన్ సర్కార్ ఈ నెల 5న జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే.

లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి విషమం.. వెంటిలేటర్‌పై చికిత్స

మెలొడీ క్వీన్ లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి విషమించిందని తెలుస్తోంది. సోమవారం అర్థరాత్రి 1.30 సమయంలో ఊపిరి తీసుకోవడంలో ఆమె ఇబ్బందికి గురవడంతో వెంటనే అప్రమత్తమైన బంధువులు