'దేవ్' టీజ‌ర్ అప్పుడే...

  • IndiaGlitz, [Friday,November 02 2018]

'ఖాకి' సినిమాతో ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ పొందిన కార్తి, ర‌కుల్ ప్రీత్ సింగ్ జంట మ‌రోసారి 'దేవ్' చిత్రంలో క‌నువిందు చేయ‌బోతున్నారు. ఇటీవ‌ల ఈ సినిమాకు సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేశారు. రజత్ రవిశంకర్ దర్శకత్వంలో ‘దేవ్’ అనే త‌మిళ సినిమా తెరకెక్కుతోంది.

ఎడ్వెంచ‌ర‌స్‌ రొమాంటిక్ కామెడీగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ ముఖ్య పాత్ర పోషించనుండగా.. ప్రకాష్ రాజ్, అమృత, రేణుక కీలక పాత్రల్లో నటించనున్నారు. అలాగే.. నిన్నటితరం నటుడు కార్తిక్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఇదిలా ఉంటే.. రూ..55 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాని రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, ప్రిన్స్ పిక్చర్స్, ఎస్.లక్ష్మణ్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈసినిమా టీజ‌ర్‌ను దీపావ‌ళికి విడుద‌ల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

More News

మ‌హేశ్ త‌ర్వాత ప్ర‌భాస్‌తోనే...

వైవిధ్య‌మైన సినిమాలు తీస్తూ ప్రేక్ష‌కుల్లో త‌న‌కంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న ద‌ర్శ‌కుడు సుకుమార్‌. రీసెంట్‌గా రామ్‌చ‌ర‌ణ్‌తో సుకుమార్ చేసిన 'రంగ‌స్థ‌లం' చాలా పెద్ద హిట్ అయ్యింది.

ఎటువైపో నీ పరుగు ప్రారంభం

క్రాంతి, పృధ్వి, అవంతిక హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం ఎటువైపో నీ పరుగు. మద్దినేని రమేష్ బాబు దర్శకత్వం వహిస్తున్నారు.

త‌మ‌న్ సెంచ‌రీ...

మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ జోరుమీదున్నాడు. అతి త‌క్కువ స‌మ‌యంలోనే త‌మ‌న్ ఓ రికార్డ్ క్రియేట్ చేశాడు. త‌క్కువ స‌మ‌యంలోనే వంద సినిమాల‌కు సంగీతాన్ని అందించేశాడ‌ట త‌మ‌న్‌.

ప్లీజ్.. పోర్న్ బ్యాన్ చేయ‌కండి...

కేంద్ర ప్ర‌భుత్వం ఆడ‌పిల్ల‌ల‌ పై జ‌రుగుతున్న అత్యాచాలు ఎక్కువ అవుతుండటంతో కొన్ని చ‌ర్య‌లు స‌త్వ‌రం తీసుకుంటుంది.

శ‌ర్వా ప్లేస్‌లో రానా

కంటెంట సినిమాల‌కు ఆద‌ర‌ణ పెరుగుతున్న త‌రుణంలో శ్రీవిష్ణుతో 'నీది నాది ఒకే క‌థ‌' సినిమా చేసిన ప్రేక్ష‌కులు, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్నారు ద‌ర్శ‌కుడు వేణు ఊడుగుల‌.