కార్తి తెలుగు చిత్రం

  • IndiaGlitz, [Monday,February 18 2019]

హీరో సూర్య సోద‌రుడిగా సినిమా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యమైనా ఆవారా, నా పేరు శివ వంటి చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యారు హీరో కార్తి. అక్క‌డి నుండి ఆయ‌న ప్ర‌తి సినిమా దాదాపుగా త‌మిళంతో పాటు తెలుగులోనూ విడుద‌ల‌వుతూ వ‌స్తుంది. రీసెంట్‌గా 'దేవ్‌' చిత్రంతోనూ ప్రేక్ష‌కుల‌ను మెప్పించే ప్ర‌య‌త్నం చేసిన కార్తి స‌క్సెస్ కాలేక‌పోయాడు. అయితే ఈ హీరో ఇప్పుడు స్ట్ర‌యిట్ తెలుగు సినిమా చేయ‌డానికి రెడీ అవుతున్నాడ‌ని టాక్‌.

'ఊపిరి' వంటి స్ట్ర‌యిట్ తెలుగు సినిమాతో విజ‌యాన్ని సాధించిన కార్తి.. మ‌రో స్ట్ర‌యిట్ తెలుగు సినిమాకు సిద్ధ‌మ‌వుతున్నాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఐతే, అనుకోకుండా ఒక‌రోజు,సాహ‌సం, మ‌న‌మంతా... ఇలా వైవిధ్య‌మైన చిత్రాల‌ను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు చంద్ర శేఖ‌ర్ ఏలేటి కార్తితో సినిమా చేస్తాడ‌ట‌. ఇప్ప‌టికే కార్తికి రెండు క‌థ‌లు వినిపిస్తే ఒక‌దాన్ని కార్తి ఫైన‌ల్ చేశాడ‌ట‌. ఇప్పుడు ఏలేటి స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడ‌ని త్వ‌ర‌లోనే పూర్తి స్క్రిప్ట్‌ను కార్తికి వినిపిస్తాడ‌ట ఏలేటి.

More News

ఎన్నికల ముందు బీసీలపై వైఎస్ జగన్ వరాల జల్లు

2019 ఎన్నికల ముందు వైసీపీ ‘బీసీ గర్జన’ నిర్వహించింది. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు వేదికగా జరిగిన ఈ సభకు భారీగా బీసీ సోదరులు తరలివచ్చారు.

జనసేన టికెట్ల కోసం ఆలుమగలు ఆసక్తి

జనసేన రోజుకు రోజుకు బలపడుతోందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.! ఇందుకు గత కొన్ని రోజులుగా చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలే కారణమని చెప్పుకోవచ్చు.

బోయ‌పాటికి బాల‌య్య కండీష‌న్స్‌

`సింహా`, `లెజెండ్` చిత్రాల త‌ర్వాత నందమూరి బాల‌కృష్ణ‌తో బోయ‌పాటి శ్రీను సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే.

బ‌న్ని త‌ల్లి పాత్ర‌లో న‌గ్మా

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

శంక‌ర్ సినిమా నుండి త‌ప్పుకున్న బాలీవుడ్ స్టార్‌

త‌మిళ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో  యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్‌హాస‌న్ టైటిల్ పాత్ర‌లో రూపొందుతోన్న చిత్రం `ఇండియ‌న్ 2`.