close
Choose your channels

Karthika Deepam : తెలుగు సీరియల్ సత్తా చాటి, టీఆర్పీల మోత మోగించిన కార్తీక దీపానికి ఎండ్ కార్డ్

Tuesday, January 24, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కార్తీక దీపం.. ఈ పేరు తెలియని తెలుగు వారు ముఖ్యంగా మహిళలు వుండరు. ఓ ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్‌లో ప్రసారమయ్యే ఈ సీరియల్ కోసం సాయంత్రం 7.30కి ఇంటిల్లిపాది టీవీల ముందుకు చేరిపోతారు. ఓటీటీలు, రకరకాల యాప్స్ వచ్చినా జనం టీవీల ముందు కదలకుండా చేసినా ఈ తరం సీరియల్ కార్తీక దీపం. ఎన్నో ఎపిసోడ్లు, ఎంతో సాగదీత అయినప్పటికీ ఆడపడుచులు ఈ ధారావాహికను నెత్తినపెట్టుకున్నారు. వంటలక్క, డాక్టర్ బాబు అనే పేర్లు తెలుగు నాట ఫుల్ ఫేమస్ అయ్యాయి. ఏళ్లుగా తెలుగువారికి వినోదాన్ని అందించిన ఈ సీరియల్‌కి శుభం కార్డ్ వేశారు మేకర్స్.

ఓర్పు, పట్టుదలతో మహిళలకు చేరువైన వంటలక్క :

డాక్టర్ బాబు మంచితనం , వంటలక్కకు వున్న ఓర్పు , సహనం .. భర్త కోసం చేసే పోరాటం ఇవన్నీ కలిసి సీరియల్‌ను హిట్ చేశాయి. అన్నింటికి మించి డాక్టర్ మోనిత. నెగిటివ్ షేడ్స్ వున్న ఈ క్యారెక్టర్ .. హీరో , హీరోయిన్లను మించి జనం గుండెల్లో నిలిచిపోయింది. ఇక ఆనందరావు, సౌందర్య పాత్రలు కూడా సీరియల్ సూపర్‌హిట్ కావడానికి కారణమైంది. టీఆర్పీల పరంగా .. దేశంలోని బడా రియాలిటీ షోలకు మించి టాప్ ప్లేస్‌లో కొనసాగింది. పెద్ద పెద్ద సినిమాలకు కూడా ఈ గౌరవం దక్కలేదంటే అతిశయోక్తి కాదు. అంతేకాదు.. ఈ సీరియల్ మీమర్స్‌కు కూడా కావాల్సినంత ముడిసరుకును అందించింది.

బడా సినిమాలను వెనక్కినెట్టి టీఆర్పీల్లో టాప్‌ :

తెలుగు సీరియల్ అంటే పాత చింతకాయ పచ్చడి, అత్తా కోడళ్ల పంచాయితీ, ఉమ్మడి కుటుంబంలో కష్టాలు ఇవేనని అనుకుంటున్న దశలో డాక్టర్ బాబు, వంటలక్కల ఎంట్రీతో సీరియల్స్ తీసేవారు సైతం ఎన్నో అంశాలను దృష్టిలో పెట్టుకుని వాటిని తెరకెక్కించే పరిస్ధితి వచ్చింది. ఎంతటి మెగా సీరియల్‌‌కైనా ఏదో రోజు శుభం కార్డ్ పడాల్సిందే. ఆరేళ్ల నుంచి కార్తీక దీపం చివరి ఎపిసోడ్ అంటూ ఎన్నో సార్లు ప్రచారం జరిగింది. అలా ఇప్పటి వరకు 15 వందలకు పైగా ఎపిసోడ్స్ నడిపించారు. చివరికి ముగింపు పలకాలని డిసైడ్ అయిన మేకర్స్.. ఈ సీరియల్‌లో విలన్‌ అయిన డాక్టర్ మోనితను దీప కాల్చిచంపడంతో శుభం కార్డ్ వేయించారు. అయితే ఏ సీరియల్ అయినా చివరికి శుభం అని బ్యాంగ్ పడాలి.. కానీ కార్తీక దీపానికి మాత్రం మళ్లీ కలుద్దాం అని క్లోజ్ చేశారు. అంటే కార్తీక దీపానికి సీక్వెల్ రాబోతుందా అని కోట్లాది మంది తెలుగు ప్రజలు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా ప్రతిరోజూ రాత్రి 7.30 గంటలకు ప్రతి తెలుగింటిలో వినిపించే ‘ఆరనీకుమా.. ఈ దీపం కార్తీకదీపం’ అనే సాంగ్ ఇక వినబడదంటే మహిళలకు ఏదో వెలితే.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.