"కార్తీక దీపం" దీప ఈజ్ బ్యాక్

  • IndiaGlitz, [Tuesday,August 23 2022]

కార్తీక దీపం.. స్టార్ మా లోనే కాదు.. తెలుగు టెలివిజన్ లోనే ఒక పెద్ద సంచలనం. ప్రతి తెలుగు ఇంటినీ, ప్రతి గుండెనీ తట్టి ఒక ప్రత్యేక స్థానం సంపాదించిన ధారావాహిక. రేటింగ్స్ విషయంలో దేశం మొత్తం మీద ఎన్నో ప్రత్యేకతలు వున్న సీరియల్. సీరియల్ లో ప్రతి క్యారక్టర్ ఎంతో ప్రాధాన్యం వున్నదే. వారిలో దీప కోట్ల హృదయాలను గెలుచుకుంది.

ఎన్ని కష్టాలు పడ్డా ఒక మహిళ నిలదొక్కుకుని మళ్ళీ ఎలా నిలబడగలదో, తన ఆత్మ గౌరవాన్ని ఎలా కాపాడుకోగలదో నిరూపించింది దీప. ఆమె ఇబ్బందుల్లో పడితే తట్టుకోలేక జనం కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆమె కష్టం నుంచి బయట పడితే స్వీట్లు పంచుకున్నారు. దీపకి మంచి జరగాలని బ్యానర్లు కట్టారు. భర్త తో ఆమె చల్లగా వుండాలని కొబ్బరికాయలు కొట్టారు.

ఒక విషాదం కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసింది. దీపని ప్రేక్షకులకు దూరం చేసింది. ఆమె సీరియల్ లో లేకపోవడం తెలుగు రాష్ట్రాల్లో పెద్ద లోటు. ఆమె మళ్ళీ ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురు చూశారు. అందరి ఎదురుచూపులు నిజం చేస్తూ దీప మళ్ళీ కార్తీక దీపంలోకి అడుగు పెట్టింది.

కార్తీక దీపం లోకి మళ్ళీ రావడం.. ప్రతి ఇంటినీ పలకరించడం చాలా సంతోషంగా ఉందని, నేను మళ్ళీ రావాలని కోరుకున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అంటోంది మనందరి అభిమాన దీప. ఇక కార్తీక దీపం సీరియల్ ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

కార్తీక దీపం ప్రోమో కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి.

Content Produced by: Indian Clicks, LLC

More News

Pawan Kalyan : జనసేనలో కోవర్టులు.. పక్కవాడికి సహకరిస్తే సస్పెన్షనే : నేతలకు పవన్ కల్యాణ్ హెచ్చరిక

2024 ఏపీ ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు క్లారిటీ వచ్చేసినట్లే కనిపిస్తోంది. గత కొన్నిరోజులుగా ఆయన వ్యవహారశైలి పూర్తిగా మారిపోయింది.

Amit Shah - Jr NTR : ఆంధ్రా సెటిలర్స్ కోసమా, స్టార్ సపోర్ట్ కోసమా.. ఎన్టీఆర్- అమిత్ షా భేటీ వెనుక..?

బీజేపీలో, కేంద్ర ప్రభుత్వంలో నెంబర్ 2గా వున్న అమిత్ షాతో టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ భేటీ కావడం..

NagaBabu : చిరంజీవి, పవన్‌ల జోలికొస్తే.. ఎవడైనా సరే తాటతీస్తా : నాగబాబు వార్నింగ్

కొణిదెల నాగబాబు.. మెగా బ్రదర్స్‌లో ఒకరు. ఒడ్డూ, పొడుగు అంతా బాగున్నప్పటికీ ఎందుకో ఆయన హీరోగా క్లిక్ కాలేదు.

నేను చేసిన సినిమాలన్నిటికంటే సైకలాజికల్ థ్రిల్లర్‌ గా వస్తున్న "అర్థం" నాకు వెరీ స్పెషల్.. హీరోయిన్ శ్రద్దాదాస్

బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రద్దాదాస్ మాయ అనే సైకియాట్రిస్ట్‌ (మానసిక వైద్య నిపుణురాలు) చుట్టూ తిరిగే కథతో ఆధ్యంతం ఆసక్తికరంగా సాగే చిత్రమే "అర్థం".

మల్టీజానర్ మూవీగా "మాటరాని మౌనమిది" ఆకట్టుకుంటుంది - దర్శకుడు సుకు పూర్వాజ్

సస్పెన్స్ థ్రిల్లర్ "శుక్ర" చిత్రంతో ప్రతిభావంతుడైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు సుకు పూర్వాజ్.