Karthikeya and Neha Shetty: కార్తికేయ, నేహా శెట్టి జంటగా 'బెదురులంక 2012' టైటిల్ ఖరారు

  • IndiaGlitz, [Wednesday,September 21 2022]

యువ హీరో కార్తికేయ, 'డీజే టిల్లు' ఫేమ్ నేహా శెట్టి జంటగా సినిమా రూపొందుతోంది. ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారం అందుకున్న 'కలర్ ఫొటో' తీసిన నిర్మాత రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మిస్తున్న తాజా చిత్రమిది. లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 3గా బెన్నీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సి. యువరాజ్ చిత్ర సమర్పకులు. క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్నారు. 

ఈ చిత్రానికి 'బెదురులంక 2012' టైటిల్ ఖరారు చేశారు. నేడు (సెప్టెంబర్ 21) కార్తికేయ గుమ్మకొండ పుట్టినరోజు. ఈ సందర్భంగా టైటిల్ వెల్లడించారు.

ఈ సందర్భంగా చిత్రనిర్మాత బెన్నీ ముప్పానేని మాట్లాడుతూ మా హీరో కార్తికేయకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన బ‌ర్త్‌డేకు టైటిల్ వెల్లడించడం సంతోషంగా ఉంది. త్వరలో ఫస్ట్ లుక్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. కామెడీ డ్రామాగా, గోదావరి నేపథ్యంలో సాగే కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఇటీవల మూడో షెడ్యూల్ ముగిసింది. యానాం, కాకినాడ, గోదావరి పరిసర ప్రాంతాల్లో అందమైన లొకేషన్లలో  చిత్రీకరణ చేశాం. ఆఖరి షెడ్యూల్ త్వరలో ఉంటుంది. దాంతో సినిమా మొత్తం పూర్తవుతుంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఐదు అద్భుతమైన బాణీలను అందించారు. 'స్వర్గీయ' సిరివెన్నెల గారు మా చిత్రంలో ఒక పాట రాశారు అన్నారు.

దర్శకుడు క్లాక్స్ మాట్లాడుతూ డ్రామెడీ (డ్రామా ప్లస్ కామెడీ) జానర్ చిత్రమిది. ఈ సినిమాలో కొత్త కార్తికేయ కనిపిస్తారు. ఒక ఊరు నేపథ్యంలో వినోదం, మానవ భావోద్వేగాలతో కూడిన కథతో సినిమా రూపొందిస్తున్నాం. ఇందులో స్ట్రాంగ్ కంటెంట్ ఉంది. అలాగే, కడుపుబ్బా నవ్వించే వినోదం ఉంది. మనసుకు నచ్చినట్టు జీవించే పాత్రలో హీరో కార్తికేయ కనిపిస్తారు. సొసైటీకి నచ్చినట్లు బతకడం రైటా? మనసుకు నచ్చినట్టు బతకడం రైటా? అనేది సినిమాలో చూడాలి అని చెప్పారు.  

కార్తికేయ, నేహా శెట్టి జంటగా నటిస్తున్న ఈ సినిమాలో అజయ్ ఘోష్, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, 'ఆటో' రామ్ ప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సత్య, సురభి ప్రభావతి, కిట్టయ్య, అనితానాథ్, దివ్య నార్ని ప్రధాన తారాగణం.

More News

Jeevitha Rajasekhar : జహీరాబాద్ లోక్‌సభ బీజేపీ అభ్యర్ధిగా జీవితా రాజశేఖర్.. జోరుగా ఊహాగానాలు..?

తెలంగాణలో ఎలాగైనా పాగా వేయాలని భావిస్తోన్న భారతీయ జనతా పార్టీ ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే.

Bigg Boss: బిగ్‌బాస్ రూల్స్ మార్చేసిన గీతూ.. నాగార్జునకే చురకలేసిన శ్రీసత్య

బిగ్‌బాస్ హౌస్‌లో గొడవలు లేవు.. జనాలకు సరైన కంటెంట్ దొరక్క బోర్ కొడుతుందంటూ హోస్ట్ నాగార్జున నుంచి విమర్శకుల

Gowri Kalyana Vaibhogame: ఒక్క పాట.. ఆరుగురు సింగర్స్.. దుమ్మురేపుతోన్న ‘‘గౌరీ కళ్యాణ వైభోగమే’’ సాంగ్

మనదేశంలో పెళ్లి పాటకు వుండే డిమాండే వేరు. వివిధ సినిమాల్లో సందర్భాన్ని బట్టి వచ్చే పాటలు పెళ్లి వేడుకల్లో,

'అహింస' ఫస్ట్ సింగిల్ 'నీతోనే నీతోనే' పాట విడుదల

క్రియేటివ్ జీనియస్ తేజ ప్రస్తుతం 'అహింస' అనే యూత్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను రూపొందిస్తున్నారు.

Naga Chaitanya: నాగ చైతన్య NC 22 షూటింగ్ ప్రారంభం

అక్కినేని నాగ చైతన్య, వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్‌లో సినిమా ప్రకటన వెలువడినప్పటి నుంచే క్యూరియాసిటీని పెంచింది.