విడుదలకి సిద్ధమవుతున్న కార్తికేయ 'రాజా విక్ర‌మార్క‌'

  • IndiaGlitz, [Saturday,October 09 2021]

యువ కథానాయకుడు కార్తికేయ గుమ్మకొండ నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ 'రాజా విక్రమార్క'. శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై ఆదిరెడ్డి .టి సమర్పణలో '88' రామారెడ్డి నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ శిష్యుడు శ్రీ సరిపల్లి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కార్తికేయ సరసన సీనియర్ తమిళ హీరో రవిచంద్రన్ మనవరాలు తాన్యా రవిచంద్రన్ హీరోయిన్‌గా నటించారు. సినిమా చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం రీ-రికార్డింగ్ పనుల్లో నిమగ్నం అయ్యారు.

ఈ సందర్భంగా నిర్మాత '88' రామారెడ్డి మాట్లాడుతూ మా 'రాజా విక్రమార్క' కథంతా హైదరాబాద్ నేపథ్యంలో జరుగుతుంది. ఇందులో గుడిలో కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. కథ ప్రకారం పురావస్తు శాఖవారు క్లోజ్ చేసిన టెంపుల్ అయ్యి ఉండాలి. లక్కీగా మాకు గండికోటలో అటువంటి టెంపుల్ దొరికింది. అందులో దర్భార్ సెట్ వేసి కీలక సన్నివేశాలు చిత్రీకరించాం. గర్భగుడి వరకు అనుమతి ఇచ్చారు. మారేడుమిల్లిలో అందరూ చిత్రీకరిస్తున్న లొకేష‌న్‌లో కాకుండా... యునీక్ లొకేష‌న్‌కు వెళ్లి, భారీ రబ్బరు ఫారెస్టులో కీలక సన్నివేశాలు తీశాం. డంప్ యార్డ్‌లో ప్రీ క్లైమాక్స్ షూట్ చేశాం. మేకింగ్ పరంగా ఎక్కడ రాజీ పడలేదు. హీరో కార్తికేయ సహకారంతో సినిమా బాగా వచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ పూర్తయిన తర్వాత, అతి త్వరలో విడుదల తేదీ వెల్లడిస్తాం అని అన్నారు.

దర్శకుడు శ్రీ సరిపల్లి మాట్లాడుతూ కార్తికేయ క్యారెక్టరైజేషన్ సినిమాకు హైలైట్ అవుతుంది. ఆయన ఎన్ఐఏ ఏజెంట్‌గా కనిపిస్తారు. ఎంట‌ర్టైనింగ్‌గా సాగే యాక్షన్ రోల్‌కు కార్తికేయ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశారు. పోస్ట్ ప్రొడక్షన్ దాదాపు పూర్తయింది. రీ-రికార్డింగ్ పనులు జరుగుతున్నాయి. త్వరలో సినిమాను మీ ముందుకు తీసుకురావాలని ఉంది అని అన్నారు.

కార్తికేయ గుమ్మకొండ, తాన్యా రవిచంద్రన్ జంటగా నటించిన ఈ సినిమాలో సుధాకర్ కోమాకుల, సాయికుమార్, తనికెళ్ళ భరణి, పశుపతి, హర్షవర్ధన్, సూర్య, జెమిని సురేష్, జబర్దస్త్ నవీన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: పి.సి.మౌళి, సంగీతం: ప్రశాంత్ ఆర్. విహారి, ఎడిటింగ్: జస్విన్ ప్రభు, ఆర్ట్: నరేష్ తిమ్మిరి, ఫైట్స్: సుబ్బు,నబా, పృథ్వీ శేఖర్, పాటలు: రామజోగయ్య శాస్త్రి, కృష్ణ కాంత్ , విఎఫ్ఎక్స్ సూపర్ వైజర్: నిఖిల్ కోడూరు, సౌండ్ ఎఫెక్ట్స్: సింక్ సినిమా, సమర్పణ: ఆదిరెడ్డి. టి, నిర్మాత: '88' రామారెడ్డి, దర్శకత్వం: శ్రీ సరిపల్లి.

More News

'జీ5' ఒరిజినల్ మూవీ 'హెడ్స్ అండ్ టేల్స్' ఫ‌స్ట్‌లుక్‌ విడుదల చేసిన రెజీనా

అక్టోబర్ 22న నుండి 'జీ 5' ఓటీటీ వేదికలో స్ట్రీమింగ్ కానున్న సినిమా వెబ్ సిరీస్‌లు, డైరెక్ట్‌-టు-డిజిట‌ల్ రిలీజ్‌లు,

అక్టోబర్ 8న  'జీ 5'లో 'రాజ రాజ చోర' విడుదల

‘జీ 5’ ఓటీటీ ఉండగా వినోదానికి లోటు ఉండదనేది వీక్షకులు చెప్పేమాట! తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ...

'ఎఫ్ 3' సెట్లో సంద‌డి చేసిన ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కాంబినేషన్‌లో వచ్చిన `ఎఫ్ 2` చిత్రం

ఆరడుగుల బుల్లెట్ ఓ క‌మ‌ర్షియ‌ల్ సినిమా... గోపీచంద్‌కు సరైన స్క్రిప్ట్ - డైరెక్టర్ బి. గోపాల్

మ్యాచో స్టార్ గోపీచంద్ - నయనతార హీరో హీరోయిన్లుగా మాస్ డైరెక్టర్ బి. గోపాల్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం ''ఆరడుగుల బుల్లెట్''.

బిగ్‌బాస్ 5 తెలుగు: కాజల్‌కు మిడిల్ ఫింగర్ చూపించిన లోబో.. రవిని రెచ్చగొట్టిన కాజల్

నామినేషన్ల తర్వాతి రోజు బిగ్‌బాస్ 5 హౌస్ హీటెక్కిపోయింది. నిన్న చోటు చేసుకున్న ఘటనలతో పాటు కొత్త వివాదాలతో కంటెస్టెంట్లు రెచ్చిపోయారు.