ఉగాది కానుకగా 'కారులో షికారుకెళితే'

  • IndiaGlitz, [Sunday,March 19 2017]

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మార్చి 31న " కారులో షికారు కెళితే " చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శకులు మాదాల కోటేశ్వర్ రావు . ధీరూ మహేష్ ,సుదర్శన్ ,ప్రియాంక , ఇషికా సింగ్ , జీవా తదితరులు నటించిన హర్రర్ థ్రిల్లర్ ని శ్రీ హరిహర ఫిల్మ్స్ పతాకంపై మధు , అనీష్ , అభిరాం లు సంయుక్తంగా నిర్మించారు . రిలీజ్ కి సిద్దమైన నేపథ్యంలో
దర్శకులు మాదాల కోటేశ్వర్ రావు మాట్లాడుతూ '' మీనాక్షి భుజంగ్ అందించిన సంగీతం ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ అవుతుంది , పాటలు చాలా బాగా వచ్చాయి తప్పకుండా అందరినీ అలరిస్తాయని ఇక చంద్రశేఖర్ సినిమాటోగ్రఫీ కూడా మా సినిమాకు మరింత అందాన్ని ఇచ్చిందని ...... మా కారులో షికారుకెళితే తప్పకుండా యూత్ అందరినీ ఆకట్టుకుంటుందని , హర్రర్ తో పాటు రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందించామని '' సినిమా విజయం పై ధీమా వ్యక్తం చేసాడు . ఇంతకుముందు గులాబీ వంటి సామజిక ఇతివృత్తం గల చిత్రాన్ని చేసి ప్రశంసలు అందుకున్న మాదాల కోటేశ్వర్ రావు కమర్షియల్ సక్సెస్ కోసం హర్రర్ బాట పట్టాడు .
చిత్ర నిర్మాతలు మధు , అనీష్ , అభిరాం లు మాట్లాడుతూ " మిత్రుడు కోటేశ్వర్ రావు చెప్పిన కథ నచ్చడంతో కేవలం అతడి పై నమ్మకంతో ఈ చిత్రాన్ని నిర్మించాం . హర్రర్ నేపథ్యంలో రూపొందిన మా కారులో షికారుకెళితే చిత్రం తప్పకుండా మంచి హిట్ అవుతుందన్న నమ్మకం ఉందని , అందుకే ఎన్ని చిత్రాలు పోటీగా ఉన్నప్పటికీ మా సినిమాని ఈనెల 31న రిలీజ్ చేస్తున్నామని అన్నారు .

More News

'మెట్రో' సినిమా సక్సెస్ మీట్

ఆర్ 4ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై `ప్రేమిస్తే`,`జర్నీ`,`పిజ్జా`వంటి బ్లాక్బస్టర్ల ను అందించిన సురేష్ కొండేటి సమర్పణ లో రజనీ తాళ్లూరి నిర్మించిన 'మెట్రో' చిత్రం

'ఆచారి అమెరికా యాత్ర' మొదలైంది!

మంచు విష్ణు-బ్రహ్మానందంల క్రేజీ కాంబినేషన్ లో జి.నాగేశ్వర్రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం'ఆచారి అమెరికా యాత్ర'.'దేనికైనా రెడీ,'ఈడోరకం ఆడోరకం'

కమల్ హాసన్ అన్న కన్నుమూత...

యూనివర్సల్ స్టార్ కమల్హాసన్ ఇప్పుడు శభాష్ నాయుడు సినిమాను ట్రాక్ ఎక్కించే పనిలో బిజీగా ఉన్నాడు.

'బాహుబలి2' ఆడియో రిలీజ్ డేట్

రాజమౌళి,ప్రభాస్ కాంబినేషన్ లో రూపొందుతోన్న విజువల్ వండర్ 'బాహుబలి 2'.

'కాటమ రాయుడు' ఎమోషన్స్

నాకు ఏ పని ఇచ్చినా చేస్తాను..అది వ్యవసాయమైనా,వీధుల ఊడ్చే పని అయినా నిజాయితీగా,నిసిగ్గుగా చేస్తాను.