close
Choose your channels

Katha Venuka Katha:‘కథ వెనుక కథ’ నుంచి ‘నిన్ను చూసీ చూడంగా...’ లిరికల్ సాంగ్ రిలీజ్

Saturday, March 11, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నిన్ను చూసీ చూడంగా
నా కన్నె న‌న్ను దాటి నీ వైపొస్తుందే

అంటూ ప్రేమికుడు ప్రేయ‌సిపై త‌నకున్న ప్రేమ‌ను వ్య‌క్తం చేస్తే

క‌న్నూ క‌న్ను చాలంట‌
ఆ చూపే చెప్పే సైగ‌లోనే మాయుందే అంటూ ప్రేయ‌సి త‌న ప్రేమికుడిని చూసి చెబుతుంది. వీరిద్ద‌రూ స‌ముద్ర తీరంలో త‌మ .ప్రేమ‌ను అందంగా ఒక‌రిపై ఒక‌రు వ్య‌క్తం చేసుకుంటున్నారు. అస‌లు వీరి మ‌ధ్య అంత గాఢ‌మైన ప్రేమ ఎందుకు పుట్టింది.. అందుకు దారి తీసిన ప‌రిస్థితులేంటి? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే ‘క‌థ వెనుక క‌థ‌’ సినిమా చూడాల్సిందేనంటున్న మేకర్స్.

కొత్త కాన్సెప్ట్ చిత్రాల‌ను అందిస్తూ న్యూ టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేయటానికి ప్రారంభ‌మైన నిర్మాణ సంస్థ దండమూడి బాక్సాఫీస్. ఈ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న తొలి చిత్రం ‘కథ వెనుక కథ’. విశ్వంత్ దుడ్డుంపూడి, శ్రీజిత గౌష్‌, శుభ శ్రీ ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టిస్తున్నారు. కృష్ణ చైత‌న్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ చిత్రానికి అవ‌నింద్ర కుమార్ నిర్మిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్‌లో రూపొందుతోన్న ఈ సినిమా నుంచి శుక్రవారం ‘నిన్ను చూసీ చూడంగా ..’ అనే పాటను లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు.

హీరో, హీరోయిన్ మ‌ధ్య సాగే ల‌వ్ సాంగ్ ఇది. శ్ర‌వ‌ణ్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందించిన ఈ పాట‌ను శ్రీకృష్ణ‌, ర‌మ్యా బెహ్రా పాడారు, పూర్ణాచారి పాట‌ను రాశారు. ఈ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ఆడియోను ఆదిత్య మ్యూజిక్ రిలీజ్ చేస్తుంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్యక్ర‌మాలు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే సినిమాను రిలీజ్ చేస్తామ‌ని నిర్మాత‌లు తెలిపారు. ఇప్ప‌టికే విడుద‌లైన మూవీ టీజ‌ర్‌కు చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది.

న‌టీన‌టులు: విశ్వంత్ దుడ్డుంపూడి, శ్రీజిత గౌష్‌, శుభ శ్రీ, అలీ, సునీల్‌, జ‌య ప్ర‌కాష్‌, బెన‌ర్జీ, ర‌ఘు బాబు, స‌త్యం రాజేష్‌, మ‌ధు నంద‌న్‌, భూపాల్‌, ఛ‌త్ర‌ప‌తి శేఖ‌ర్‌, ఖ‌య్యుం, ఈరోజుల్లో సాయి, రూప త‌దిత‌రులు

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.