Katha Venuka Katha:మే 12న సస్పెన్స్ థ్రిల్లర్ ‘కథ వెనుక కథ’ రిలీజ్

  • IndiaGlitz, [Monday,May 08 2023]

కొత్త కాన్సెప్ట్ చిత్రాల‌ను అందిస్తూ న్యూ టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేయటానికి ప్రారంభ‌మైన నిర్మాణ సంస్థ దండమూడి బాక్సాఫీస్. ఈ బ్యాన‌ర్‌పై రూపొందిన తొలి చిత్రం ‘కథ వెనుక కథ’. విశ్వంత్ దుడ్డుంపూడి, శ్రీజిత గౌష్‌, శుభ శ్రీ ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టించారు. కృష్ణ చైత‌న్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రానికి అవ‌నీంద్ర కుమార్ నిర్మించారు సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్‌లో రూపొందిన ఈ మూవీని మే 12న విడుదల చేస్తున్నారు.

ఈ సందర్భంగా...

చిత్ర నిర్మాత అవ‌నీంద్ర కుమార్ మాట్లాడుతూ ‘‘‘కథ వెనుక కథ’ సినిమాను మే 12న విడుదల చేస్తున్నాం. మా సాయి సినిమాను ముందుండి నడిపించారు. సినిమా చాలా బాగా వచ్చింది. సీట్ ఎడ్జ్ మూమెంట్స్‌తో ఆడియెన్స్‌ను ఆక‌ట్టుకుంటుంది. సునీల్‌గారు, హీరో విశ్వంత్ దుడ్డుంపూడి, శ్రీజిత గౌష్‌, శుభ శ్రీ స‌హా న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్‌కి థాంక్స్‌’’ అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ గొట్టిపాటి సాయి మాట్లాడుతూ ‘‘నేను ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి 30 ఏళ్లు అయ్యాయి. 80కిపైగా సినిమాలు చేశాను.మా నిర్మాతగారు జీవితంలో ఎన్నో ఆటు పోట్లను ఎదుర్కొని ఈ స్థాయికి వ‌చ్చారు. ఇప్పుడు సినీ ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చారు. ప్యాషన్‌తో అన్ కాంప్ర‌మైజ్డ్‌గా, మంచి కంటెంట్‌తో చేసిన సినిమా త‌ప్ప‌కుండా మే 12న వ‌స్తోన్న క‌థ వెనుక క‌థ సినిమాను ఆద‌రించాల‌ని ప్రేక్ష‌కుల‌ను కోరుతున్నాను’’ అన్నారు.

న‌టీన‌టులు: విశ్వంత్ దుడ్డుంపూడి, శ్రీజిత గౌష్‌, శుభ శ్రీ, అలీ, సునీల్‌, జ‌య ప్ర‌కాష్‌, బెన‌ర్జీ, ర‌ఘు బాబు, స‌త్యం రాజేష్‌, మ‌ధు నంద‌న్‌, భూపాల్‌, ఛ‌త్ర‌ప‌తి శేఖ‌ర్‌, ఖ‌య్యుం, ఈరోజుల్లో సాయి, రూప త‌దిత‌రులు

More News

Pawan Kalyan:మహారాష్ట్రలో 'ఓజీ' షూటింగ్.. పవన్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చిన జనసైనికులు, పవర్‌స్టార్ లుక్ వైరల్

పవన్ కల్యాణ్ ప్రస్తుతం సినిమాలు, రాజకీయాలతో ఫుల్ బిజీ. చేతిలో వున్న సినిమాలను పూర్తి చేసి 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలని ఆయన ప్రణాళికాబద్ధంగా

Delhi Liquor Scam:ఆరోపణలు సరే.. ఆధారాలేవి, అసలు నేరం జరిగిందా : ఢిల్లీ లిక్కర్ స్కాంపై న్యాయస్థానం సంచలన వ్యాఖ్యలు

తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా దుమారం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.

AAP Minister Atishi:ఢిల్లీ లిక్కర్ స్కాం.. ఒక్క పైసాకైనా ఆధారాలున్నాయా , కోర్ట్ చెప్పిందిదే : ఆప్ మంత్రి అతిషి

ఢిల్లీ లిక్కర్ స్కాం జరిగిందనడానికి ఆధారాలు లేవంటూ సీబీఐ ప్రత్యేక కోర్ట్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఆప్ నేత , ఢిల్లీ మంత్రి అతిషి బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Telugu Girl Killed:అమెరికాలో ఉన్మాది కాల్పులు.. తెలుగుమ్మాయి దుర్మరణం, మృతురాలి తండ్రి జడ్జి

వృత్తి , ఉద్యోగ , వ్యాపారాల కోసం అమెరికాకు వెళ్తున్న భారతీయులు అక్కడ ఉన్మాదులు, దోపిడీ దొంగల చేతుల్లో బలవుతున్నారు.

Lal Salaam:సూప‌ర్ స్టార్ రజినీకాంత్ ‘లాల్ స‌లాం’ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్

భారీ బ‌డ్జెట్  విజువ‌ల్ వండ‌ర్స్ చిత్రాల‌తో పాటు డిఫ‌రెంట్ కంటెంట్ చిత్రాల‌ను ప్రేక్ష‌కుల‌కు అందిస్తూ చిత్ర నిర్మాణ రంగంలో త‌మ‌కంటూ ఓ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకున్న‌