close
Choose your channels

‘పవన్ నాలుగో భార్యను మరిచారు.. జగన్ సారీ చెప్పాలి’

Monday, November 11, 2019 • తెలుగు Comments

‘పవన్ నాలుగో భార్యను మరిచారు.. జగన్ సారీ చెప్పాలి’

ఇదేంటి పవన్ కల్యాణ్‌కు నాలుగో భార్య కూడా ఉందా అని ఆశ్చర్యపోతున్నారా..? అవును టాలీవుడ్ సినీ క్రిటిక్ కత్తి మహేశ్‌ లెక్క ప్రకారం నాలుగో భార్య కూడా ఉందట. తనే స్వయంగా ఫేస్‌బుక్ వేదికగా కత్తి రాసుకొచ్చాడు. అసలు ఆయన ఎందుకిలా అన్నాడు..? అసలు ఆయన నాలుగో భార్య ఎవరు..? వైఎస్ జగన్ ఎందుకు క్షమాపణ చెప్పాలి..? అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

వివాదాలే ఊపిరి అంటూ క్రిటిక్ కత్తి మహేశ్ బతికేస్తున్నాడు..! మరీ ముఖ్యంగా మెగా ఫ్యామిలీలో అది కూడా పవర్‌స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేయడం అంటే కత్తికి చాలా సరదా.. అంతేకాదు దురద కూడా!. రోజులో ఒకట్రెండు సార్లయినా పవన్ గురించి ట్వీట్ చేయాల్సిందే.. లేకుంటే ఫేస్‌బుక్ పోస్ట్ పెట్టాల్సిందే.. అలా చేయకపోతే బహుశా కడుపు నిండా అన్నం తినడం.. కంటి నిండా నిద్రపోడేమో..! అలాంటి మహేశ్ తాజాగా పవన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఏకంగా నాదెండ్ల మనోహర్.. పవన్ కల్యాణ్‌కు నాలుగో భార్య అంటూ వ్యాఖ్యానించాడు. ఈ మేరకు తన ఫేస్‌బుక్ ఓ పోస్ట్ సైతం చేశాడు.

అసలు ఈ పంచాయితీ ఎక్కడ మొదలైంది..!?

ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ బోధనను తీసుకొస్తున్నట్లు సీఎం వైఎస్ జగన్ సంచలన ప్రకటన చేసిన విషయం విదితమే. ప్రకటన ఒక్కటే కాదు ఉత్తర్వులు సైతం జారీ అయ్యాయ్.. అయితే ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు మొదలుకుని జనసేనాని పవన్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వరకూ అందరూ విమర్శలు గుప్పించారు. ఈ విమర్శలన్నింటికీ జగన్ సింగిల్ లైన్‌లో ఒక్కొక్కరికీ సమాధానం చెప్పారు. ‘సినిమా నటుడు పవన్ కల్యాణ్‌కు ఎన్ని పెళ్లిళ్లు అయ్యాయో.. ఎంత మంది పిల్లలో మరి. నలుగురు ఐదుగురు పిల్లలున్న పవన్ కళ్యాణ్ పిల్లల్ని ఎక్కడ చదివిస్తున్నారు. వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదవటం లేదా?. మేం ప్రపంచ స్థాయి కోసం ఇంగ్లీష్ మీడియం తెస్తుంటే.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, చంద్రబాబు, వెంకయ్య, నటుడు పవన్ విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వం పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియామ్ ప్రవేశపెట్టడము ఎందుకు విమర్శ లు చేస్తున్నారు. పేదల పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదవకూడదా..?’ అని ఇంగ్లీష్ బోధనపై విమర్శించిన వారందరికీ ఒక్కసారిగా వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి స్ట్రాంగ్ పంచ్‌ల వర్షం కురిపించారు. విజయవాడలో జరిగిన అబ్దుల్ కలాం విద్యా పురస్కారాల కార్యక్రమం సందర్భంగా జగన్ మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.

ఎవరూ స్పందించకండి..!

జగన్ వ్యాఖ్యలపై జనసేన తరఫున నాదెండ్ల మనోహర్ స్పందిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి.. జనసేన అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌‌పై చేసిన వ్యక్తిగత ఆరోపణలపై మన పార్టీ నాయకులు గానీ జనసైనికులు గానీ స్పందించ వద్దని విజ్ఞప్తి చేస్తున్నాము. భవన నిర్మాణ కార్మికుల కోసం మనం చేస్తున్న పోరాటాన్ని పక్కదారి పట్టించడానికి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని భావిస్తున్నాము. మన అధ్యక్షులు ప్రభుత్వ పాలసీల గురించి మాట్లాడుతుండగా ముఖ్యమంత్రి చేస్తున్న వ్యక్తిగత వ్యాఖ్యలు బాధాకరమైనప్పటికీ ప్రజా క్షేమం కోసం మనం భరిద్దామని పవన్‌ చెప్పారు. మంగళవారం పవన్‌ కళ్యాణ్‌ విజయవాడ వస్తున్నారు. ఆ రోజు సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటుచేస్తున్నాం. పార్టీ అధ్యక్షులు అన్నిటికీ బదులిస్తారు. దయచేసి పార్టీ శ్రేణులు సంయమనం పాటించవలసిందిగా కోరుతున్నాను’ అంటూ ఓ నోట్ రిలీజ్ చేశారు.

కత్తి మహేశ్ రియాక్షన్..!

‘ నాలుగో భార్య నాదేండ్లని మర్చిపోయినందుకు జగన్ గారు క్షమాపణలు చెప్పాలి కాబోలు!.

- ‘ వ్యక్తిగత విమర్శలేమిట్రా మనోహర్!.. పెళ్లాల సంఖ్య గుప్తమా లేక పిల్లలు ఎందరో తెలియకపోవడం తట్టుకోలేని తికమకా?. అయినా ఒరేయ్! జగన్ ని ఆర్ధిక ఉగ్రవాది అన్నప్పుడు. జగన్ రెడ్డి...రెడ్డి అని కులాన్ని ఒత్తిఒత్తి సాడిస్టిక్ ఆనందం పొందినప్పుడు. కడప రౌడీలు అని మాటిమాటికీ వాగినప్పుడు.కోడికత్తి అని వెక్కిరించిన్నప్పుడు. కోర్టుకెళ్లే నేరస్తుడు అని కూసినప్పుడు. అవన్నీ వ్యక్తిగతం కాదా?. మీరు అంటే రాజకీయ విమర్శ...మేము అంటే వ్యక్తిగత విమర్శ. అంతేగా...సరే కానీ..’ అని కత్తి మహేశ్‌‌ ఫేస్‌బుక్‌లో రాసుకొచ్చాడు. అయితే కత్తి వ్యాఖ్యలపై జనసేన కార్యకర్తలు, మెగాభిమానులు తీవ్ర స్థాయిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరి నాదెండ్ల, పవన్ ఈ వ్యవహారంపై ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో మరి.


Get Breaking News Alerts From IndiaGlitz