close
Choose your channels

కత్తి మహేష్ మృతి.. షాక్ లో నాని, మంచు మనోజ్

Sunday, July 11, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కత్తి మహేష్ మృతి.. షాక్ లో నాని, మంచు మనోజ్

సినీ విమర్శకుడు కత్తి మహేష్ మరణ వార్త టాలీవుడ్ లో విషాదాన్ని మిగిల్చింది. కత్తి మహేష్ తో అనుబంధం ఉన్న సెలెబ్రిటీలంతా ఆయనకు మృతికి సంతాపం తెలుపుతున్నారు. జూన్ 26న నెల్లూరు సమీపంలో కత్తి మహేష్ కారు ప్రమాదానికి గురయ్యారు. 

తల, కంటికి తీవ్ర గాయాలు కావడంతో నెల్లూరులో చికిత్స అనంతరం చెన్నైకి తరలించారు. అక్కడ వైద్యులు కత్తి మహేష్ కు కీలకమైన ఆపరేషన్స్ కూడా నిర్వహించారు. అయితే ప్రాణాపాయం లేదని చెబుతూ వచ్చారు. కానీ ఊహించని విధంగా కత్తి మహేష్ ఆరోగ్యం విషమించి మరణించారు. 

కత్తి మహేష్ ఊపిరి తిత్తుల్లో నీరు చేరడం వల్ల ఆరోగ్యం క్షీణించింది అని, అందువల్లే కత్తి మహేష్ మృతి చెందారు అని వైద్యులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా కత్తి మహేష్ మృతికి నేచురల్ నాని సంతాపం తెలియజేశారు. 

'కత్తి మహేష్ గారి మరణ వార్త విని షాక్ అయ్యా. యూనిక్ కంటెంట్ ఉన్న చిత్రాలని ఆయన తన రివ్యూల ద్వారా ప్రోత్సహించడం గమనించేవాడిని. ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు దేవుడు మనో ధైర్యాన్ని ఇవ్వాలి' అని నాని ట్వీట్ చేశారు. 

'కత్తి మహేష్ మరణ వార్త తీవ్రంగా బాధించింది, షాక్ కి గురిచేసింది. ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతి. కత్తి మహేష్ ఆత్మకు శాంతి చేకూరాలి' అని హీరో మంచు మనోజ్ ట్వీట్ చేశారు. 

'కత్తి మహేష్ తో బిగ్ బాస్ హౌస్ లో ఎక్కువ సమయం గడిపాను. మంచి నాలెజ్డ్ ఉన్న వ్యక్తి. ఆయన ఐడియాలజీ కూడా బావుంటుంది. అకాల మరణం చెందారు. ఆయన కుటుంబ సభ్యులకు నా సానుభూతి' అని నటుడు ఆదర్శ్ బాలకృష్ణ ట్వీట్ చేశాడు. 


Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.