close
Choose your channels

బ్రేకింగ్: తీవ్ర విషాదం.. తుదిశ్వాస విడిచిన కత్తి మహేష్

Saturday, July 10, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బ్రేకింగ్: తీవ్ర విషాదం.. తుదిశ్వాస విడిచిన కత్తి మహేష్

తీవ్ర విషాదకర ఘటన చోటు చేసుకుంది. కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడిన ప్రముఖ ఫిలిం క్రిటిక్, నటుడు కత్తి మహేష్ మృతి చెందారు. ఇప్పుడే అందిన ఈ విషాదకర వార్తతో చిత్ర పరిశ్రమ, కత్తి మహేష్ అభిమానులు, సన్నిహితులు శోకసంద్రంలో మునిగిపోయారు.

చెన్నై అపోలో ఆసుపత్రిలో కత్తి మహేష్ చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన కత్తి మహేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటున్నారనే ఇప్పటి వరకు వార్తలు వచ్చాయి. ఆయనకు ఇక ఎలాంటి ప్రమాదం లేదని కూడా వార్తలు వినిపించాయి. కానీ ఇది ఊహించని పరిణామం.

గత నెల జూన్ 26న కత్తి మహేష్ కారులో ప్రయాణిస్తూ నెల్లూరు సమీపంలో ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. దీనితో అతడిని వెంటనే నెల్లూరులోని మెడికేర్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం చెన్నైకి తరలించారు. కొన్ని వారాలుగా మహేష్ అక్కడే చికిత్స పొందుతున్నారు.

తలకు, కంటికి బలమైన గాయాలు కావడంతో వైద్యులు కత్తి మహేష్ కు కీలకమైన సర్జరీలు నిర్వహించారు. కత్తి మహేష్ అవుట్ ఆఫ్ డేంజర్ అని, కొన్ని రోజుల పాటు విశ్రాంతి అవసరం అని వార్తలు వచ్చాయి. దీనితో ఆయన సన్నిహితులు, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ సడెన్ గా మహేష్ మృతి చెందడం అత్యంత విషాదంగా మారింది.

ఫిలిం క్రిటిక్ గా, రాజకీయ విశ్లేషకుడిగా కత్తి మహేష్ గుర్తింపు పొందారు. కత్తి మహేష్ చివరంగా క్రాక్ అనే చిత్రంలో కూడా నటించారు. టివి చర్చా కార్యక్రమాలు కూడా కత్తి మహేష్ కు గుర్తింపు తెచ్చిపెట్టాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.